TOP9 ET: OG నుంచి దిమ్మతిరిగే అప్డేట్ | నాని సీరియస్.. టిల్లు గాడి మాస్ వార్నింగ్..
బయట ఏదైనా ఓ పెద్ద సంఘటన జరిగితే.. ఆ సంఘటనపై సెల్రబిటీలు రియాక్టైతే బాగుంటుందని.. జనాల్లోకి ఆ సంఘటన తాలూక తీవ్రత వెళుతుందని కొంత మంది రిపోర్టర్స్ భావిస్తుంటారు. అలా భావించిన ఓ రిపోర్టర్ రీసెంట్‌గా సమంతను కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన పై ప్రశ్న అడిగారు. సినిమాలు గురించి మాత్రమే రిపోర్టర్స్ అడుగుతారని అనుకున్నారో ఏమో.. రిపోర్టర్ అడిగిన ఈ ఊహించని ప్రశ్నకు దెబ్బకు షాకయ్యారు సమంత.
01.og update: OG నుంచి దిమ్మతిరిగే అప్డేట్.! ఓజీ నుంచి దిమ్మతిరిగే అప్డేట్ బయటికి వచ్చింది. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్.. పవన్ బర్త్ డే కానుకగా.. సెప్టెంబర్ 2న రిలీజ్ కానుందనే హింట్ మేకర్స్ నుంచి వచ్చింది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లోకి వచ్చారు. తమన్ ఇచ్చిన మ్యూజిక్.. పవన్ కళ్యాణ్ క్రేజీ మ్యాజిక్ కలిస్తే.. ఈ సాంగ్ విస్పోటనం అవడం ఖాయమని నెట్టింట అంటున్నారు. ఓజీని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. 02.nani: ప్రభాస్‌పై కామెంట్స్.. నాని సీరియస్.! ప్రభాస్ జోకర్ అంటూ.. బాలీవుడ్ యాక్టర్ అర్షద్ వార్సీ చేసిన కాంట్రో కామెంట్స్ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. టాలీవుడ్ సెలబ్రిటీలను కాస్త సీరియస్‌గా రియాక్టయ్యేలా చేస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా… అర్షద్ చేసిన ఈ కాంట్రో కామెంట్స్ పై నాని కూడా సెటైరికల్‌గా రియాక్టయ్యారు. అర్షద్‌కు తన యాక్టింగ్ కెరీర్లో ఎప్పుడూ లేనంత పబ్లిసిటీ వచ్చిందని.. చెప్పారు. అర్షద్ గుర్తింపు మీద పంచ్ విసిరారు. 03.sidhu: మాటలు జాగ్రత్త టిల్లు గాడి మాస్ వార్నింగ్.. నాని ఒక్కరే కాదు.. టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్దు జొన్నల గడ్డ కూడా.. ప్రభాస్ పై నెగెటివ్ కామెంట్స్ చేసిన అర్షద్ వార్సీకు కాస్త ఘాటుగానే కౌంటర్ ఇచ్చాడు. కల్కి సక్సెస్ వెనక స్ట్రాంగ్ పిల్లర్ ప్రభాస్ అన్నారు. బావప్రకటనా స్వేచ్చ అందరికీ ఉందని.. కానీ ఎలా వ్యక్తీకరిస్తున్నామనేది ముఖ్యమన్నారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్త అని.....