TOP9 ET: నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్.! ఐకాన్ స్టారా మజాకా.!| దేవరకొండ రికార్డ్ బ్రేక్.? టిల్లుగాడు తోపిక.!

TOP9 ET: నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్.! ఐకాన్ స్టారా మజాకా.!| దేవరకొండ రికార్డ్ బ్రేక్.? టిల్లుగాడు తోపిక.!

Anil kumar poka

|

Updated on: Apr 19, 2024 | 11:26 AM

బన్నీ బర్త్‌ డే సందర్భంగా రిలీజ్ అయిన పుష్ప 2 టీజర్‌.. అనుమానమే లేకుండా అందర్నీ ఆకట్టుకుంది. బన్నీ ఫ్యాన్స్‌ను ఎగిరిగంతేసేలా చేసింది. కానీ దాంతో పాటే.. టీజర్లో బన్నీ ఓ డైలాగ్‌ చెబితే బాగుండు అనే కామెంట్ కూడా చాలా గట్టిగానే వచ్చింది. ఇక ఇవన్నీ పట్టుకున్నారో ఏమో తెలీదు కానీ.. తొందర్లో మరో టీజర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట డైరెక్టర్ సుకుమార్. ఇక ఆ టీజర్లో మాస్, క్లాస్‌ అందర్నీ ఫిదా చేసే అన్ని సీన్లతో పాటే..

01. tillu: దేవరకొండ రికార్డ్ బ్రేక్ ? టిల్లుగాడు తోపిక.!

ఫిల్మ్ ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ అవ్వడం బద్దలవ్వడం కామన్. చిరు, బాలయ్య లాంటి స్టార్ హీరోలు వాళ్ల రికార్డులు వాళ్లే క్రియేట్ చేసుకుని.. వాళ్లే బద్దలు కొట్టుకుంటారు కానీ.. ఆ కింద హీరోలు మాత్రం ఒకరి కొకరు ఈ రికార్డుల పరుగులో ఒక్కో సారి విజేతలుగా నిలుస్తుంటారు. అలా విజయ్‌ దేవర కొండ తన గీతాగోవిందం సినిమాతో.. ఓ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆ సినితో 70 కోట్ల షేర్‌ను.. అందుకుని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు. ఇక ఇప్పుడు టిల్లు గాడు.. ఈ షేర్‌కు దగ్గర్లో ఉన్నాడు. ఇప్పటికే 125 కోట్ల గ్రాస్‌ వసూలు చేసిన టిల్లు గాడు.. షేర్‌ లోనూ.. 70 కోట్లకు దగ్గర్లో ఉన్నాడు. దీంతో దేవరకొండ రికార్డ్‌ బ్రేక్‌ అవుతుందనే టాక్ వస్తోంది .. ఫిల్మ్ నగర్లో!

02. allu arjun: పుష్ప2 నుంచి మరో టీజర్..

బన్నీ బర్త్‌ డే సందర్భంగా రిలీజ్ అయిన పుష్ప 2 టీజర్‌.. అనుమానమే లేకుండా అందర్నీ ఆకట్టుకుంది. బన్నీ ఫ్యాన్స్‌ను ఎగిరిగంతేసేలా చేసింది. కానీ దాంతో పాటే.. టీజర్లో బన్నీ ఓ డైలాగ్‌ చెబితే బాగుండు అనే కామెంట్ కూడా చాలా గట్టిగానే వచ్చింది. ఇక ఇవన్నీ పట్టుకున్నారో ఏమో తెలీదు కానీ.. తొందర్లో మరో టీజర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట డైరెక్టర్ సుకుమార్. ఇక ఆ టీజర్లో మాస్, క్లాస్‌ అందర్నీ ఫిదా చేసే అన్ని సీన్లతో పాటే.. పుష్ప చెప్పే ఓ పవర్ ఫుల్ డైలాగ్‌ కూడా ఉండనుందట. సో ఐకాన్‌ ఫ్యాన్స్ గెట్ రెడీ ఫర్ పుష్ప2 సెకండ్ టీజర్ .

03.pushpa 2: నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా.!

పుష్ప 2 సినిమాపై జనాల్లో అంచనాలు పెరిగిపోతుంటే.. ఓటీటీ సంస్థల్లో ఈ మూవీ రైట్స్ దక్కించుకోవాలన్న ఆరాటం కూడా పెరిగిపోతోంది. ఓటీటీ సంస్థల మధ్య ఈ మూవీ రైట్స్ విషయంలో పోటీ కూడా ఎక్కువైంది. ఇక ఈ పోటీలోనే తాజాగా నెట్ ఫ్లిక్స్ కూడా గెలిచిందనే న్యూస్ వినిపిస్తోంది. పుష్ప2 రైట్స్‌ను నెట్‌ ఫ్లిక్స్ దాదాపు 350 కోట్ల బేస్ ప్రైస్‌ కు కొనుగోలు చేసిందనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో గుప్పు మంటోంది.

04.guntur karam: Tvల్లో రికార్డులు బద్దలు కొట్టిన.. గుంటూరోడు.

గుంటూరు ఎక్కడ ఎంట్రీ ఇస్తే అక్కడ రికార్డులు క్రియేట్ అవ్వడమో.. బద్దలవ్వడమో జరుగుతూనే ఉంది. ఇక రీసెంట్గా టీవీలో టెలీకాస్ట్ అయిన మహేష్‌ గుంటూరు కారం మూవీ.. 9.23 టీఆర్పీ రేంటింగ్‌ వచ్చేలా చేసుకుంది. ఈ మధ్య కాలంలో టెలీకాస్ట్ అయిన స్టార్ హీరోల సినిమాల రేంటింగ్‌ కంటే.. గుంటూరోడి మూవీకి వచ్చిన టీఆర్పీ రేంటింగ్ ఎక్కువ. దీంతో గుంటూరోడు మరో సారి టెలివిజన్ సర్కిల్లో హాట్ టాపిక్ అవుతున్నాడు.

05.arjun 2nd daughter: ఈ హీరో 2వ కూతురు.. ఏక్‌ధమ్‌ హీరోయిన్ మెటీరియల్.

స్టార్ హీరోల కూతుళ్లు సినిమాల్లోకి హీరోయిన్లుగా రావడం.. తన అందంతో.. యాక్టింగ్‌ ట్యాలెంట్‌తో సపరేట్ ఫ్యాన్ బేస్‌ను ఏర్పాటు చేసుకోవడం కామన్ అయిపోయింది ఈ రోజుల్లో! కానీ యాక్షన్ హీరో అర్జున్ సర్జా 2వ కూతురు అంజలి మాత్రం.. ఇంకా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వకముందే.. తన బ్యూటిఫుల్ లుక్స్‌తో ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంటున్నారు. తన హాట్‌ లుక్స్‌తో.. సాఫ్ట్ స్కిన్‌ షోతో.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ఏక్‌ధమ్‌ హీరోయిన్ మెటీరియల్ అనే మాసీ కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు.

06.vishal: ప్రభాస్‌ పెళ్లిపై.. విశాల్ కౌంటర్.

అందరికీ ఓ పజిల్లా.. టైం పాస్ ముచ్చటలా.. తప్పించుకోవడానికి పనికొచ్చే టాపిక్ లా మారిపోయింది ప్రభాస్ పెళ్లి మ్యాటర్! ఇప్పుడు తమిళ్ స్టార్ హీరో విశాల్‌కి కూడా ఇలాగే పనికొచ్చింది ఈ మ్యాటర్! తమళ్‌ ఫిల్మ్ సర్కిల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ అనే ట్యాగ్ ఉన్న విశాల్‌కు.. మీ పెళ్లెప్పుడనే కొశ్చన్ తెలుగలో ఎదురైంది. దీంతో ఏం చెప్పాలో అర్థం కానీ విశాల్.. ప్రభాస్ పెళ్లి తర్వాతే తన పెళ్లి అంటూ తప్పించుకున్నారు. అంతేకాదు తన పెళ్లి కార్డును ప్రభాస్‌కే ఫస్ట్ ఇస్తా అంటూ చెప్పి తన పెళ్లి మ్యాటర్‌ ఇగ్నోర్ అయ్యేలా చేశాడు.

07.pooja: సినిమాలు లేవు.. కానీ పక్కనే ప్రియుడు ఉన్నాడుగా.!

ఫేస్‌కు మేకప్‌.. చేసేందుకు ఫిల్మ్స్‌.. తమను చూసేందుకు ఫ్యాన్స్‌! ఈమూడు లేకపోతే అల్లకల్లోలం అయి.. ఓ రేంజ్లో పరేషాన్ అవుతారు హీరోయిన్లు. కానీ పూజా హెగ్డే మాత్రం పిచ్చ లైట్‌గా ఉంటున్నారు. భాయ్ ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. రీసెంట్‌గా తన ఓ ప్రైవేట్ పార్టీ నుంచి బయటికి వస్తూ.. తన ప్రియుడు రోహన్ మెహ్రాతో కెమెరా కంటికి చిక్కారు కూడా..!

08.sreelel: కాలేజీ కుర్రాళ్లతో కలిసి.. కుర్చీమడత పెట్టిన శ్రీలీల.

గుంటూరు కారం సినిమాలోని తన డ్యాన్సింగ్‌ స్కిల్స్‌తో ఆల్మోస్ట్ అందర్నీ మడతెట్టే పనిని చేస్తున్న శ్రీలీల.. రీసెంట్‌గా కాలేజ్ కుర్రాళ్లను కూడా మడతెట్టేశారు. ఏపీ నెల్లూరులోని కాలేజీ ఫెస్ట్‌కు గెస్ట్ గా వెళ్లిన ఈ బ్యూటీ.. కుర్రాళ్ల అరుపుల మధ్యలో.. స్టేజ్‌పై కుర్చీ మడతెట్టి సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. తన స్టెప్పులతో కాలేజ్‌ ఫెస్ట్ ను కన్నుల పండగగా మార్చారు. తన డ్యాన్స్‌ వీడియోలతో.. కాలేజ్ కుర్రాళ్ల రియాక్షన్తో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు.

09.deepika: కడుపులో బిడ్డతో.. షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.!

కన్సీవ్‌ అవగానే.. కాలు కిందపెట్టకుండా రెస్ట్ తీసుకునే అమ్మాయిలున్న ఈ రోజుల్లో .. హీరోయిన్ దీపిక మాత్రం.. షూటింగ్స్‌లో కష్టపడుతోంది. ప్రొడ్యూసర్లకు.. ఇచ్చిన కమిట్మెంట్‌ను.. డేట్స్‌ను కాదనకుండా.. తన అప్‌కమింగ్ సినిమాలను ఫినిష్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఇక ఈ పనితో ఓ పక్క విమర్శలతో పాటు.. చప్పట్లు కొట్టించుకుంటోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!