TOP9 ET: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు | ఈ ఇద్దరు బాబులదే ఆ అరుదైన ఘనత.!

|

Sep 17, 2024 | 10:08 AM

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు దేవరలు, దేవర మూవీలో కనిపించనున్నారట. అంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీలో ట్రిపుల్‌ రోల్ చేశారట. అయితే ఇందులో తండ్రిగా.. కొడుకుగా.. యంగ్ టైగర్ ఒక్కరే చేశారనైతే.. ట్రైలర్‌ చూసిన వాళ్లందరికీ తెలిసిపోయింది. మరి ఆ మూడో ఎన్టీఆర్ సంగతేంటి అనేది.. సినిమా చూస్తేనే తెలుస్తుంది. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్.. వేచి సినిమా చూడండి!

01.NTR: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు దేవరలు, దేవర మూవీలో కనిపించనున్నారట. అంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీలో ట్రిపుల్‌ రోల్ చేశారట. అయితే ఇందులో తండ్రిగా.. కొడుకుగా.. యంగ్ టైగర్ ఒక్కరే చేశారనైతే.. ట్రైలర్‌ చూసిన వాళ్లందరికీ తెలిసిపోయింది. మరి ఆ మూడో ఎన్టీఆర్ సంగతేంటి అనేది.. సినిమా చూస్తేనే తెలుస్తుంది. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్.. వేచి సినిమా చూడండి!

02.prbhas: ఈ ఇద్దరు బాబులదే.. ఆ అరుదైన ఘనత.

బాబుల్లో బాబు.. ప్రభాస్‌ బాబు, మహేష్‌ బాబే గొప్ప అంటున్నారు కొందరు నెటిజన్లు. అనడమే కాదు.. ఇప్పటి వరకు ఈ ఇద్దరు మాత్రమే.. తమ సినిమాలతో 100 ప్లస్‌ కోట్ల షేర్‌ను రిపీటెడ్‌ గా వసూళు చేశారని చెబుతున్నారు. ఇక పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటి వరకు 6 సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర 6 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా.. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు 5 సినిమాలతో ఈ ఫీట్‌ను సాధించారు. ఇలా ఈ ఇద్దరు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అరుదైన 100 కోట్ల షేర్ ఘనత సాధించారు.

03.ram charan: బీస్ట్‌ మోడ్‌లో చరణ్‌.. ఇక దిమ్మతిరిగిపోవాలి.

ఎట్ ప్రజెంట్ గేమ్‌ ఛేంజర్ మూవీలో కాస్త సాఫ్ట్ అండ్ కూల్‌గా కనిపిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌.. నెక్ట్ బీస్ట్ మోడ్‌లోకి ట్రాన్స్‌ఫామ్ అవుతున్నా అంటున్నారు. తను నెక్స్ట్ చేయబోయే బుచ్చిబాబు సనా సినిమా కోసం ఇప్పటి నుంచే రెడీ అవుతున్నట్టు ఓ హింట్ ఇచ్చాడు. బాడీ బిల్డింగ్‌కు రెడీ అవుతున్నట్టు ఓ ఫోటో ను షేర్ చేశారు చెర్రీ.

04.sidharth: ముచ్చటగా.. రెండో పెళ్లి

సెలబ్రిటీల పెళ్లిళ్లు గమ్మత్తుగానే కాదు.. పదిమంది చెప్పుకోడానికి కూడా క్రేజీ గా ఉంటాయి. ఇక రీసెంట్‌గా తమ ప్రేమ జర్నీని పెళ్లితో ముగించిన సిద్దార్థ్‌ – అదితి పెళ్లి మ్యాటర్ కూడా ఇప్పుడు నెట్టింట హాట్‌ టాపిక్ అవుతుంది. సిద్దార్థ ఇప్పటికే ఒకమ్మాయిని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకోవడం.. అదితి కూడా సేమ్ అలానే చేసి.. సిద్దార్థ్‌ తో ప్రేమలో పడడం.. ఇప్పుడు వీరిద్దరు రెండో పెళ్లితో ఒక్కటవ్వడం.. చూడముచ్చటగా ఉందనే కామెంట్ నెట్టింట వచ్చేలా చేసుకుంటోంది.

05.jani: సంచలన విషయాలు బయటపెట్టిన జానీ మాస్టర్ బాధితురాలు.!

లైంగిక వేధింపుల కేసులో స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై నమోదు చేసిన FIRలో బాధితురాలు సంచలన విషయాలు వెల్లడించారు. 2017లో ఢీ షోలో తనకు జానీ మాస్టర్ పరిచయమ్యారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కోట్ చేశారు. 2019లో అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్గా జానీ మాస్టర్ దగ్గర చేరానని.. ఆ క్రమంలోనే ఓ షో కోసం ముంబై వెళ్లినప్పుడు తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు చెప్పారు. అంతేకాదు ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ జానీ మాస్టర్ బెదిరించాడని…మతం మార్చుకొని.. తనని పెళ్లి చేసుకోవాలంటూ.. ఒత్తిడి కూడా చేశాడని ఆమె పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్‌లో చెప్పారు.

06.jani: జానీ మాస్టర్‌కు షాకిచ్చిన జనసేన పార్టీ.!

లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్‌కు షాకిచ్చింది జనసేన పార్టీ. జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జానీని ఆదేశించినట్టు.. జనసేన పార్టీ ఓ లేఖను విడుదల చేసింది. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తున్నట్టు కూడా ఆ లేఖలో మెన్షన్ చేసింది పార్టీ మేనేజ్‌మెంట్‌.

07.jani master: జానీ కేస్‌ ఫిర్యాదు చేసిన అమ్మాయి ఫోన్ స్విచ్చాఫ్‌.!

జానీ మాస్టర్ లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనంగా మారిన వేళ.. ఈ స్టార్ కొరియోగ్రాఫర్ సైలెంట్‌ అయిపోయారు. మీడియాకు దూరంగా ఉంటున్నాడు. దీంతో ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నాడని పోలీసులు పేర్కొంటున్నారు. అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పోలీసులకు ఫిర్యాదు చేసిన సదరు యువతి కూడా ప్రస్తుతానికి పోలీసులకు అందుబాటులో లేనని చెప్పినట్లుగా తెలుస్తోంది. తాను ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నానని హైదరాబాద్ వచ్చిన తర్వాత తాను పోలీసులను కలిసి పూర్తి వివరాలు అందించడమే కాదు ఆధారాలు కూడా అందిస్తానని చెబుతున్నట్లుగా తెలుస్తోంది.

08.devara: NTR చరిష్మా కారణంగా.. పర్మిషన్ ఇవ్వని పోలీసులు.!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు పోలీసులు మొండి చేయి చూపించారు. దేవర సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు పర్మిషన్స్ ఇచ్చేది లేదంటూ చెప్పారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఫ్యాన్స్ బేస్ ఎక్కువ ఉండడంతో.. ఓపెన్ ఏరియాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం రిస్కని.. శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుందని థింక్ చేసిన పోలీసులు.. హైద్రాబాద్‌లో.. ఓ గ్రౌండ్‌లో ప్లాన్ చేసిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నో చెప్పారట. బదులుగా ఇండోర్లో ఈవెంట్‌ చేసుకోవాల్సిందిగా మేకర్స్‌కు సూచించారట.

09.Hema: పరువు – ప్రతిష్ట

డ్రగ్స్ కేసు అవుట్ ఆఫ్ టాపిక్ అయినా.. ఆ కేసు విషయాన్నే మరిచిపోయినా.. తరుచూ మీడియా ముందుకు వచ్చి తాను నెగెటివ్‌గా మెడికల్ పరీక్షలో తేలినట్టు చెబుతూనే ఉన్నారు హేమ. అలా చెబుతూ చెబూతు.. రీసెంట్గా మాత్రం ఎమోషనల్ అయ్యారు. డ్రగ్‌ రిపోర్ట్‌లో తనకు పాజిటివ్‌ వచ్చిదంటూ కొన్ని మీడియా సంస్థలు న్యూస్ ప్రచారం చేయడం పై మండిపడ్డారు. ఆ వార్తలు చూసి తన తల్లి అనారోగ్యానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. పరువు కోసం తాను చనిపోవడానికి సిద్దం అంటూ మీడియా పెద్దలకు సవాల్ విసిరారు.

10.alaia: NTR కోసం పెద్ద త్యాగం చేసిన ఆలియా.!

NTR కోసం ఆలియా పెద్ద త్యాగమే చేశారు. యంగ్ టైగర్ దేవర కోసం తన సినిమాను వాయిదా వేసుకున్నా అంటూ చెప్పారు బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌. జిగ్రా సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కావాల్సి ఉన్నా… దేవర రిలీజ్ అవుతుండటంతో జిగ్రాను రెండు వారాలు వాయిదా వేశారు. బ్రదర్‌ సెంటిమెంట్‌తో తెరకెక్కిన జిగ్రా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.