TOP9 ET: ఇక నుంచి Jr.NTR కాదు Mr.NTR | సమంతతో డేటింగ్.? అసలు ఎవరీ రాజ్.?
సమంతతో డైరెక్టర్ రాజ్ డేటింగ్‌లో ఉన్నాడని గత రెండు రోజులుగా నెట్టింట వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను నిజం చేస్తూ.. వీరిద్దరి సోషల్ మీడియా హ్యాండిల్లో కలిసి ఉన్న ఫోటోలు వస్తున్నాయి. అవి కాస్త విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈక్రమంలోనే సమంత ఫ్యాన్స్ అండ్ నెటిజన్స్ ఎవరీ రాజ్ అంటూ ఆరాతీస్తున్నారు. నెట్టింట ఈ డైరెక్టర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాజ్ ఎవరో కాదు..
01. Samantha: సమంతతో డేటింగ్.? అసలు ఎవరీ రాజ్.?
సమంతతో డైరెక్టర్ రాజ్ డేటింగ్‌లో ఉన్నాడని గత రెండు రోజులుగా నెట్టింట వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను నిజం చేస్తూ.. వీరిద్దరి సోషల్ మీడియా హ్యాండిల్లో కలిసి ఉన్న ఫోటోలు వస్తున్నాయి. అవి కాస్త విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈక్రమంలోనే సమంత ఫ్యాన్స్ అండ్ నెటిజన్స్ ఎవరీ రాజ్ అంటూ ఆరాతీస్తున్నారు. నెట్టింట ఈ డైరెక్టర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాజ్ ఎవరో కాదు.. తెలుగు వాడే. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో జన్మించారు. ఇంజనీరింగ్ తర్వాత హైయర్ స్టడీస్ కోసం అమెరికాకు వెళ్లి.. తన ఫ్రెండ్ కృష్ణ డీకేతో కలిసి డీ2ఆర్ ఫిల్మ్ బ్యానర్‌ను స్థాపించారు. షార్ట్ ఫిల్మ్ నుంచి.. ఇప్పుడు బాలీవుడ్‌లో సినిమాలు తీస్తూ.. బెస్ట్ డైరెక్టర్స్‌గా మారిపోయారు. అన్నట్టు .. ఈ డైరెక్టర్ మన మెగాస్టార్ చిరుకు క్రేజీ ఫ్యాన్ కూడా..!
02.ntr: ఇక నుంచి Jr.Ntr కాదు Mr. NTR.!
ఫిల్మ్ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టింది మొదలు.. ఎన్టీఆర్‌ను జూనియర్ ఎన్టీఆర్ అనే అంటున్నాం! పెద్ద ఎన్టీఆర్‌కు జూనియార్ వర్షన్‌గా ఫీలవుతున్నాం! అయితే ఇప్పుడీ పేరే మారిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ కాదు.. మిస్టర్ ఎన్టీఆర్‌గా మారిపోయింది. రీసెంట్‌గా ఎన్టీఆర్ టీం.. ఎన్టీఆర్‌కు ప్రమాదం జరిగినట్టు వైరల్ అయిన న్యూస్ పై క్లారిటీ ఇస్తూ ఓ నోట్ రిలీజ్ చేసింది. అయితే ఈ నోట్‌లో.. జూనియర్ ఎన్టీఆర్ బదులు.. మిస్టర్ ఎన్టీఆర్ అంటూ కోట్ చేసింది. అయితే ఇదే ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.
03.thangalan review: తంగలాన్ రివ్యూ..! బొమ్మ అదిరిపోయింది భయ్యా..!
విక్రమ్ హీరోగా.. పా రంజిత్ డైరెక్షన్లో తెరకెక్కిన పీరియాడిక్ అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ తంగలాన్. ఇక రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ.. అందర్నీ ఆకట్టుకుంటోంది. ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళుతోంది. ఇక విక్రమ్ యాక్టింగ్ ఎప్పటిలాగే అదిరిపోగా.. డైరెక్టర్ విజన్ అండ్ స్టోరీ నరేషన్ కూడా అందర్నీ ఆకట్టుకుంటోంది. అయితే మధ్యలో స్లో నెరేషన్ కాస్త ఇబ్బందిగా మారినప్పటికీ ఓవరాల్‌గా బాగుంది. విక్రమ్, మాళవిక యాక్టింగ్, డైరెక్టర్ టేకింగ్, విజువల్స్, బీజీఎమ్, స్క్రీన్ ప్లే, ఫైనల్ ట్విస్ట్ ప్లస్ కాగా.. స్లో నరేషన్, సాగదీత సీన్లు మైనస్.
04.samantha: సమంత పోస్ట్.. నాగచైతన్య గురించేనా?
రెండు మూడు రోజుల నుంచి నాగచైతన్య శోభిత.. నెట్టింట ట్రెండ్ అవుతున్న వేళ.. సమంత తన ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఆ ఫోటోలో సమంత వేసుకున్న టీషర్ట్‌పై ఉన్న ఓ కొటేషన్ హైలెట్ అవుతోంది. ద మ్యూజియమ్ ఆఫ్ పీస్ అండ్ క్వైట్ అని సమంత టీషర్ట్ పై ఉన్న లైనే ఇప్పుడు అందరికీ కనిపిస్తోంది. దానికి తోడు సమంత తన చేతిని నుదిటిపై పెట్టుకుని మిడిల్ ఫింగర్ చూపిస్తున్నట్టుగా ఏదో కన్వే చేస్తున్నట్టుగా ఉంది. అంతే ఇక ఈ పోస్ట్‌ను సమంత నాగ చైతన్య – శోభిత ఎంగేజ్‌మెంట్‌ను ఉద్దేశించే పోస్ట్ చేసిందంటూ నెట్టింట ఓ వర్గం ప్రచారం చేయడం మొదలెట్టింది.
05.hareesh shankar request: మిస్టర్ బచ్చన్ రిలీజ్ అయిన వేళ అభిమానులకు హరీష్ శంకర్ మెసేజ్.!
మిస్టర్ బచ్చన్ మూవీ రిలీజ్ అయిన వేళ.. అభిమానులకు, ఫిల్మ్ లవర్స్‌కు హరీష్ శంకర్ ఓ మేసేజ్ ఇచ్చారు. సినిమాను చూసి ఎంజాయ్ చేయాలే కానీ.. సోషల్ మీడియాలో ఆ సినిమాలోని క్లిప్పులను షేర్ చేయదంటూ రెక్వెస్ట్ చేశారు. అలా చేస్తే.. సిల్వర్ స్క్రీన్ పై సినిమా చూసేటప్పుడు ఉండే ఎగ్టైట్ మెంట్ పోతుదంటూ ట్వీట్ చేశారు.
05. VD12: కోచింగ్ తీసుకుంటున్న విజయ్ ఇక మాస్ జాతర పీక్స్ అంతే.!
విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఫస్ట్ లుక్ ఈ మధ్యే విడుదల చేసారు దర్శక నిర్మాతలు. పూర్తిగా రగ్గ్‌డ్ లుక్‌లో కనిపించారు విజయ్. తన సినిమాల్లో ఎప్పుడూ కనిపించనంత మాసీ లుక్‌లోకి మారిపోయారు రౌడీ బాయ్. మార్చ్ 28, 2025న VD12 విడుదల కానుంది. అయితే ఈ సినిమా ఊహించిన దానికంటే ఎక్కువ యాక్షన్ ఓరియెంటెడ్‌గా ఉండబోతుందని తెలుస్తుంది. దీనికోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారు విజయ్.
06.Nayanathara: పిల్లలతో హ్యాపీగా.. జాలీగా.!
స్టార్ హీరోయిన్ నయనతార తన ఇద్దరు పిల్లలను ఎత్తుకుని నడుచుకుంటూ వెళ్తున్న వీడియో క్లిప్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఉయిర్, ఉలగ్‌తో కలిసి ఆమె ఎప్పుడూ టైమ్ స్పెండ్ చేస్తుంటారు. వారిద్దరితో ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ వీడియో క్లిప్ నెటిజన్ల మనసు దోచుకుంటోంది. అందర్నీ ఫిదా అయ్యేలా చేస్తోంది.
07.Amitabh: తగ్గేదేలే.. ఒక్క ఎపిసోడ్ చేస్తే రూ.5 కోట్లు ఇవ్వాల్సిందే.
తాజాగా కౌన్ బనేగా కరోడ్‌పతి కొత్త సీజన్ ప్రారంభం అయ్యింది. ఈ నేపథ్యంలో బిగ్ బీ రెమ్యూనరేషన్‌కు సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సీజన్‌లో ఒక్కో ఎపిసోడ్‌కు 5 కోట్ల పారితోషికం అందుకోబోతున్నారట అమితాబ్. కేబీసీ తొలి సీజన్‌లో ఒక్కో ఎపిసోడ్‌కు 25 లక్షల పారితోషికం మాత్రమే తీసుకున్నారు అమితాబ్.
08.Suriya: తంగలాన్‌కు సూర్య సపోర్ట్
రిలీజ్‌కు ముందే తంగలాన్ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. ఈ సినిమా ఘన విజయం సాధించబోతుంది అంటూ తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశారు. విక్రమ్ హీరోగా తెరకెక్కిన తంగలాన్ స్వతంత్ర దినోత్సవ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికైతే మంచి టాక్‌నే సొంతం చేసుకుంది. డైరెక్టర్‌గా పా రంజిత్ పేరు కూడా పాన్ ఇండియా రేంజ్‌లో మోగిపోతోంది.
09.Ananya: అనన్య బాధ్యత తీసుకున్న స్టార్ ప్రొడ్యూసర్ .
అనన్య పాండేను హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం చేసిన కరణ్ జోహార్, ఈ బ్యూటీని మరో సారి లాంచ్ చేయబోతున్నారు. లైగర్ బ్యూటీని ఓటీటీకి పరిచయం చేసే బాధ్యత కూడా తీసుకున్నారు కరణ్. అనన్య లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న ఓటీటీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఎనౌన్స్‌మెంట్ ఇచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.