TOP9 ET: దేవర ఎఫెక్ట్‌ NTRకు గాయం | నాగచైతన్య ఎంగేజ్‌మెంట్‌..ఆ డైరెక్టర్‌తో సమంత డేటింగ్‌?

|

Aug 15, 2024 | 4:23 PM

జూనియర్ ఎన్టీఆర్ కి గాయం అయింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ న్యూస్‌పై తాజాగా ఎన్టీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. తారక్‌ జిమ్‌లో వర్కవుట్ చేస్తుండగా.. కొన్ని రోజుల క్రితం ఎడమ మణికట్టు బెణికిందని ఓ నోట్ రిలీజ్ చేసింది. ముందు జాగ్రత్తగా ఆయన చేతికి ఒక కట్టు కట్టారని ఆ నోట్‌లో కోట్ చేసింది. ఎన్టీఆర్‌కు గాయం న్యూస్ తెలిసి గాబరా పడుతున్న ఫ్యాన్స్‌కు రిలీఫ్‌ ఇచ్చింది.

01.ntr: దేవర యాక్షన్ ఎఫెక్ట్‌ NTRకు గాయం..

జూనియర్ ఎన్టీఆర్ కి గాయం అయింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ న్యూస్‌పై తాజాగా ఎన్టీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. తారక్‌ జిమ్‌లో వర్కవుట్ చేస్తుండగా.. కొన్ని రోజుల క్రితం ఎడమ మణికట్టు బెణికిందని ఓ నోట్ రిలీజ్ చేసింది. ముందు జాగ్రత్తగా ఆయన చేతికి ఒక కట్టు కట్టారని ఆ నోట్‌లో కోట్ చేసింది. ఎన్టీఆర్‌కు గాయం న్యూస్ తెలిసి గాబరా పడుతున్న ఫ్యాన్స్‌కు రిలీఫ్‌ ఇచ్చింది.

02.ap: ఇస్మార్ట్‌ శంకర్‌కు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్

ఇస్మార్ట్ శంకర్‌కు ఏపీ ప్రభుత్వం డబుల్ ధమాఖా ఇచ్చింది. డబుల్ ఇస్మార్ట్ సినిమా టికెట్‌ రేట్స్‌ పెంచుకోవచ్చంటూ పర్మిషన్ ఇచ్చింది. ఈ మేరకు జీవో రిలీజ్‌ చేసింది. ఇక దాదాపు 70 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్‌ మూవీ టికెట్‌ రేట్స్‌… ఏపీ సర్కార్ ఇచ్చిన ఈ బంపర్‌ ఆఫర్ తో .. ప్రతీ టికెట్ పై 35 రూపాయల మేర పెరగనుంది. 10 రోజుల పాటు.. టికెట్‌పై ఈ అడిషనల్ రేట్ ఉండనుంది.

03.prabhas: ప్రభాస్‌తో నేను నటించట్లేదు (ప్రభాస్ సీరియస్, మృణాల్)

తొందరి పడి ఓ కోయిల ముందు కూసినట్టే.. ఫ్యాన్స్ ఏదోదో ఊహించుకుంటూ ఉంటుంటే.. అలాంటిదేం లేదని చెబుతూనే స్టార్ హీరోయిన్ మృణాల్ కూడా ప్రభాస్‌ సినిమాలో తాను లేనంటూ లీక్‌ ఇచ్చేశారు. ప్రభాస్‌ ఫౌజీ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ అంటూ పోస్ట్ చేసిన ఫిల్మ్ ఫేర్ ఇన్‌స్టా పోస్ట్‌కు రిప్లైగా ఆమె విషయం చెప్పారు. ప్రభాస్‌తో తాను నటించడం లేదంటూ.. తన ఫ్యాన్స్‌తో పాటు.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు క్లారిటీ ఇచ్చారు.

04.naga chaitanya: నాగచైతన్య ఎంగేజ్‌మెంట్‌.. ఆ డైరెక్టర్‌తో సమంత డేటింగ్‌?

నాగ చైతన్య- శోభిత ఎంగేజ్‌మెంట్ న్యూస్ ఇంకా నెట్టింట హడావిడి చేస్తున్న వేళ.. సమంత స్టార్ డైరెక్టర్ రాజ్తో డేటింగ్‌లో ఉన్నాడనే న్యూస్ బయటికి వచ్చింది. ఆన్యూస్ ఇప్పుడు నాగచైతన్య న్యూస్‌తో పోటీపడుతూ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఫ్యామిలీ మ్యాన్ 2 నుంచి డైరెక్టర్‌ రాజ్‌తో.. మంచి రాపో మెయిన్‌టేన్ చేస్తోంది సమంత. ఆ సిరీస్‌ తర్వాత ఈయన డైరెక్షన్లోనే సిటాడెల్ సిరీస్‌ చేసింది. ఆ సిరీస్‌ నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్‌లో ప్రీమియర్ కానుంది.

05.bunny: బన్నీ వల్లే ఇక్కడున్నా..

ఎట్ ప్రజెంట్ ఆయ్ సినిమాతో మన మందుకు వస్తున్న బన్నీ వాసు.. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎమోషనల్ అయ్యారు. తన లైఫ్‌లో ఒకడున్నాడని.. తనకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతాడని.. అమ్మ తర్వాత తనే అంటూ.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి లవబుల్ కామెంట్స్ చేశారు. తన వల్లే తాను ఇక్కడ ఉన్నానంటూ.. ఇక్కడి వరకు వచ్చానంటూ.. చెప్పారు. ఈ క్రమంలోనే తమ మధ్య గ్యాప్ వచ్చిందంటూ వస్తున్న వార్తలను కొట్టిపారేశారు బన్నీ వాసు.

06.Saripodhaa Sanivaaram: థౌజెండ్‌ వాట్స్‌ కిక్కిస్తున్న సరిపోదా శనివారం ట్రైలర్

సోకుల పాలెం హీరోగా.. కోపం అనే డిసీజ్‌తో బాధపడుతున్న కామన్‌ మ్యాన్‌గా..! శనివారం మాత్రమే తనకు నచ్చనోడిని కొట్టే సూర్యగా.. రిమైనింగ్‌ వారాల్లో బుద్దిమంతునిగా.. ! సరిపోదా శనివారం మూవీ ట్రైలర్‌లో కనిపించిన నాని.. ఈ మూవీ ట్రైలర్‌తో ఇప్పుడు అందర్లో గూస్ బంప్స్‌ పుట్టిస్తున్నాడు. థౌజెండ్ వాట్స్ కిక్కిస్తున్నాడు. నాని యాక్షన్ .. మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్‌ బెజోయ్‌ కాంబినేషన్‌లో ఖతర్నాక్ గా ఉండడంతో.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేశాడు.

07.shankar: శంకర్ దెబ్బకు దివాలా తీస్తున్న నిర్మాతలు

ఇప్పుడంటే అందరూ తీస్తున్నారు కానీ.. ఒకప్పుడు భారీ బడ్జెట్ సినిమాలకు.. కేరాఫ్ శంకర్! భారీ కలెక్షన్స్‌ సాధించే సినిమాలకు ఆయనే టార్చ్‌ బేరర్! అందుకే శంకర్‌తో సినిమాలు తీసేందుకు స్టార్ ప్రొడ్యూసర్లు చిన్న పోరాటమే చేసేవారు. కానీ ఇప్పుడు ఆయనతో సినిమాలు చేయకుండా ఉండేందుకు ఆయన నుంచి దూరంగా పారిపోతున్నారు. స్నేహితుడు సినిమా తర్వాత నుంచి శంకర్‌కు దూరంగా పరుగెత్తడం మొదలెట్టారు. ఎందుకంటే శంకర్ సినిమాల కారణంగా స్టార్ ప్రొడ్యక్షన్ కంపెనీస్ అయిన ఏవీఎమ్‌, ఆస్కార్ ఫిల్మ్స్‌, జెమినీ ఫిల్మ్ భారీగా నష్టాలు చవిచూశాయి. ఆల్మోస్ట్ దివాలా తీసే స్థితికి వచ్చేశాయి. దీంతో శంకర్ సినిమాలకు ప్రొడ్యూసర్‌ స్కేర్ సిటీ మొదలైంది. ఇదే విషయం శంకర్‌ను .. శంకర్ హీరోలకు కూడా ఇబ్బంది పెడుతోంది.

08.bigg boss: బిగ్ బాస్ సీజన్ కి కొత్త హోస్ట్‌

అందరికీ తెలిసిన విషయమే బిగ్ బాస్‌ హోస్ట్ మారిపోయారు! కానీ సర్‌ప్రైజింగ్‌లీ ఈ షో హోస్ట్‌గా మక్కల్ సెల్వన్ ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే మహారాజ్‌ సినిమా సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న ఈ స్టార్ హీరో అయితేనే.. తమిళ్ బిగ్ బాస్‌ సీజన్‌ 8ను బాగా డీల్ చేస్తాడని ఈ షో మేకర్స్‌ నమ్ముతున్నారు. కమల్‌కు ఈయనే స్టార్ రీప్లేసర్ అంటూ ఫిక్స్ కూడా అయ్యారు. ఇక ఆ క్రమంలోనే ఈ స్టార్ హీరోతో బిగ్ బాస్ తమిళ్ నిర్వాహకులు మంతనాలు జరుపుతున్నారని.. తొందర్లో అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రానుందని కోలీవుడ్ లో న్యూస్.

09.niharika: కోట్లు కొల్లగొడుతున్న కమిటీ కుర్రాళ్లు

నిహారిక కమిటీ కుర్రాళ్లు సినిమా కోట్లు కొల్లగొడుతోంది. రిలీజ్‌ అయిన మొదటి రోజు సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. తాజాగా 5 రోజుల్లో 8.49 కోట్లు వసూలు చేసింది. ఈ నెంబర్‌ మరింతగా పెరిగేలానే ఉంది. ఎందుకంటే ఈ సినిమాకు రెస్పాన్స్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Aug 15, 2024 04:23 PM