TOP9 ET: 571 కోట్ల ఆస్తి.. NTR సొంతం | అందరూ జాగ్రత్త డైరెక్టర్ మరణం ఓ గుణపాఠం.

ఒకవేళ నెలకు 3 కోట్లు సంపాదిస్తే మీరు ఎలా ఫీలవుతారు? మీరేమో కానీ నేను మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ లానే ఫీలవుతా? ఎందుకంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ పర్ మంత్ సంపాదన 3 కోట్ల పై మాటేనట. అందులోనూ ఇప్పటి వరకు ఈ స్టార్ హీరో కూడేసిన ఆస్తుల విలువ 70 మిలియన్ డాలర్స్‌.. అంటే 571 కోట్లకు పైనే అట. అయితే ఈ న్యూస్ ఎలా బయటికి వచ్చిందో తెలీదు కానీ..స్టార్ సంపాదన ... ఆస్తుల విలువ ఇదంటూ.. కొన్ని న్యూసులు ఈ మధ్య ఎక్కువగా బయటికి వస్తున్నాయి

TOP9 ET: 571 కోట్ల ఆస్తి.. NTR సొంతం | అందరూ జాగ్రత్త డైరెక్టర్ మరణం ఓ గుణపాఠం.

|

Updated on: Mar 13, 2024 | 6:45 AM

01. ntr: 571 కోట్ల ఆస్తి.. NTR సొంతం

ఒకవేళ నెలకు 3 కోట్లు సంపాదిస్తే మీరు ఎలా ఫీలవుతారు? మీరేమో కానీ నేను మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ లానే ఫీలవుతా? ఎందుకంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ పర్ మంత్ సంపాదన 3 కోట్ల పై మాటేనట. అందులోనూ ఇప్పటి వరకు ఈ స్టార్ హీరో కూడేసిన ఆస్తుల విలువ 70 మిలియన్ డాలర్స్‌.. అంటే 571 కోట్లకు పైనే అట. అయితే ఈ న్యూస్ ఎలా బయటికి వచ్చిందో తెలీదు కానీ..స్టార్ సంపాదన .. ఆస్తుల విలువ ఇదంటూ.. కొన్ని న్యూసులు ఈ మధ్య ఎక్కువగా బయటికి వస్తున్నాయి. వీరి సంపాదన చూసి.. అందరూ షాకయ్యేలా.. అసూయ పడేలా.. బాధపడేలా చేస్తున్నాయి.

02. pawan mahesh: మరో ఫ్యాన్ వార్ పవన్‌ – మహేష్‌ మధ్య తీవ్ర లొల్లి

ప్రభాస్‌ అల్లు అర్జున్‌ల మధ్య జరిగిన ఫ్యాన్ వార్ మరవకముందే.. మరో ఫ్యాన్‌ వార్ మొదలైపోయింది. కొంత మంది మహేష్ ఫ్యాన్స్‌ మధ్య.. పవన్‌ ఫ్యాన్స్‌ మధ్య.. ట్విట్టర్ ఎక్స్‌ ప్లాట్‌ ఫాం వేదికగా లొల్లి తీవ్రమైంది. పవన్‌ జల్సా… మహేష్ అతడు సినిమాల మధ్య కంపారిజన్‌తో మొదలైన ఈ ఫ్యాన్‌ వార్… చూస్తుండగానే ఎక్కువైంది. ఒకరి ఫ్యాన్స్‌ ను మరొకరు తిట్టుకునేలా.. వారి అపొనెంట్ హీరోను విపరీతంగా ట్రోల్ చేసేలా చేస్తోంది.

03.allu arjun: తిరుగు ప్రయాణంలోనూ రచ్చ రచ్చే..!

ఎంట్రీ మాత్రమే కాదు.. ఎగ్జిట్ కూడా గ్రాండ్‌గానే జరిగింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. నిన్న కాక మొన్నే అల్లు అర్జున్ వైజాగ్లో అడుగుపెట్టడంతో ఊగిపోయిన వైజాగ్‌.. ఇప్పడు అల్లు అర్జున్ వైజాన్‌ నుంచి కాలు బయట పెట్టే క్రమంలోనూ అదిరిపోయింది. బన్నీని చూసేందుకు భారీగా వచ్చిన ఫ్యాన్స్.. బన్నీకి సెండాఫ్ ఇచ్చేందుకు కూడా భారీగానే ఆయన బస చేసిన హోటల్‌కు వెళ్లారు. బన్నీకి చాలా క్రేజీగా బాయ్ బాయ్‌ చెప్పారు.

04.shekar: శేఖర్ కమ్ములను వెంటాడుతున్న అతిపెద్ద కష్టం

కష్టమనేదే లేకుండా.. రిస్క్‌ అనేదే చేయకుండా.. చాలా సింపుల్ అండ్ ఫీల్ గుడ్ సినిమాలతో మార్కెట్ క్రియేట్ చేసుకున్న శేఖర్ కమ్ముల.. ప్రస్తుతం రూట్ మార్చారు. పాన్ ఇండియా డైరెక్టర్ల ట్రాక్ ఎక్కారు. పాన్ ఇండియా హీరో ధనుష్‌తో.. టాలీవుడ్ హీరో కింగ్ నాగ్‌తో.. కుబేర సినిమా మొదలెట్టాడు. మొదలైతే పెట్టాడు కానీ.. తన కప్ ఆఫ్ టీ కానీ ఈ టైప్‌ సినిమాతో .. పాన్ ఇండియా రేంజ్లో సక్సెస్ అవుతాడా? లేక ఆ పాన్ ఇండియా సక్సెస్ను అందుకునే క్రమంలో.. ధనుష్‌ను సాటిస్ ఫై చేసే క్రమంలో కష్టాల పాలవుతారో చూడాలి మరి!

05. prabhas: షాకింగ్ న్యూస్‌ ఏపీలో సలార్‌కు కలెక్షన్స్‌ రాలేదా?

ఓవర్‌ ఆల్‌గా సలార్ మూవీ బిగ్ హిట్ అయింది. కలెక్షన్స్‌ కుమ్మేసింది. నైజాం ఏరియాలో అయితే ఆల్ టైం హైయెస్ట్ వసూళ్లను రాబట్టేసింది. ఇదంతా నిజమే. అయితే ఏపీలోని కొన్ని ఏరియాల్లో మాత్రం ఈ సినిమా కలెక్షన్స్‌ను మాత్రం రాబట్టలేకపోయిందట. ఆ ఏరియా డిస్ట్రిబ్యూటర్లను నష్టాలపాలు చేసిందట. అయితే రీసెంట్గా ఇదంతా లెక్కేసిన ఈ మూవీ ప్రొడ్యూసర్ హోంబలే కిరంగదూర్.. సలార్ సినిమా కారణంగా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు.. మనీ వెనక్కు ఇచ్చేశాడట. లెక్కలన్నీ సెట్ చేసేశారట.

06. vishwak sen: బుక్ మై షో ఇష్యూ.. వార్నింగ్‌ ఇచ్చిన విశ్వక్ సేన్

టాలీవుడ్ హీరోల్లో ఎప్పుడూ కాస్త హైపరాక్టివ్గా ఉండే విశ్వక్ సేన్.. తన సోషల్ మీడియా అకౌంట్లలో ఓ వార్నింగ్ పోస్ట్ పెట్టాడు. బుక్ మై షోల్లో తన గామి సినిమాకు తప్పుడు రివ్యూలు, రేటింగ్ రావడంపై రియాక్టయ్యారు. కొన్ని ఫైక్ యాప్స్‌తో.. కావాలని అలా చేస్తున్న వారిని హెచ్చరించారు. మీరు ఎన్ని సార్లు కిందకు లాగినా.. తాను పైకి లేస్తూనే ఉంటా అంటూ.. ఓ నోట్ రిలీజ్ చేశారు. దాంతో పాటే తన గామి సినిమాను సక్సెస్ చేసిందుకు ఫిల్మ్ లవర్స్‌ అండ్ తన ఫ్యాన్స్‌కు స్పెషల్ థాంక్స్ చెప్పారు ఈ స్టార్ హీరో.

07.om bheem bush: నీలి చిత్రం చూపించి ఫిల్మ్ ప్రమోషనా? ఇదేం కర్మ!

ఓం భీం బుష్ – సినిమా పేరు మాత్రమే కాదు.. ప్రమోషన్స్‌ను కూడా కాస్త డిఫరెంట్‌గానే ప్లాన్ చేస్తూ.. అందరి చేత చప్పట్లు కొట్టించుకుంటున్న ఈ మూవీ టీం.. ఇప్పుడు కొంత మంది ప్రేక్షకుల చేత తిట్లు వచ్చేలా చేసుకుంటున్నారు. కారణం ఈ సారి తమ మూవీ ప్రమోషన్ కోసం ఓ నీలి చిత్రం బ్యాక్రౌండ్ వినియోగిచుకోవడం! ఎస్ ! రీసెంట్గా ఓ ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేసిన ఓం భీమ్ బుష్ టీం.. అందులో ఓ పాపులర్ పోర్న్‌ వీడియోలోని బ్యాక్రౌండ్‌ను చూపించారు. ఆ వెంటనే ఏం చూస్తున్నారు చదువుకోండి ఫస్ట్ అంటూ.. ఇలాంటివి చూడొద్దంటూ ఈ మూవీలోని హీరోలు శ్రీవిష్ణు, రాహుల్, ప్రియదర్శి చెబుతుంటారు. అయితే ఈ వీడియోతోనే ‘ముందు ఇలాంటి ఛీప్ ప్రమోషన్లు మానండి ఫస్ట్’ అనే కాంమెట్ వచ్చేలా చేసుకుంటున్నారు.

08. sidhu konnala: స్టార్ హీరోయిన్‌తో సిద్దు జొన్నలగడ్డ పెళ్లి?

మొత్తానికి కిరణ్ అబ్బవరం తన డెబ్యూ మూవీ హీరోయిన్… రహస్యతో పెళ్లికి రెడీ అయిపోయాడు. ఇక ఈ హీరో దారిలోనే నడిచేందుకు సిద్దు బోయ్‌ కూడా ఫిక్స్ అయిపోయినట్టు ఉన్నాడు. ఓ స్టార్ హీరోయిన్‌ను అతి త్వరలో పెళ్లి చేసుకోనున్నాడు. అయితే ఈ హింట్ ఇచ్చింది ఎవరో కాదు సిద్దు జొన్నలగడ్డ అన్న చైతు జొన్నల గడ్డ. రీసెంట్గా రిలీజ్ అయిన బబుల్ గమ్ సినిమాలో.. హీరో రోషన్ ఫాదర్‌గా యాక్ట్ చేసిన వ్యక్తే.. చైతు జొన్నలగడ్డ. ఆయనే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన తమ్ముడ పెళ్లి గురించి హింట్ ఇచ్చారు. ఊరికే అన్నాడో.. లేక కావాలని అన్నాడో తెలీదు కానీ.. సిద్దు పెళ్లి మ్యాటర్‌ మాత్రం నెట్టింట వైరల్ అయ్యేలా చేశారు.

09.surya kiran: అందరూ జాగ్రత్త డైరెక్టర్ మరణం ఓ గుణపాఠం

మనకు తెలిసిన విషయమే..! అందరికీ అవగాహన ఉన్న విషయమే! అయినా కానీ నిర్లక్యం చేస్తాం! ఏమవుతుందిలే అని ఊరుకుంటాం! అదో పెద్ద సమస్య కాదన్నట్టు మన రొటీన్ లైప్‌ స్టైల్‌ను ఫాలో అవుతాం! కానీ ఫలితం మరణం! ఇప్పుడు డైరెక్టర్ సూర్య కిరణ్‌ విషయంలోనూ ఇదే జరిగింది. నిన్న కాక మొన్న ఓ బాలీవుడ్ హీరోయిన్ చెల్లె విషయంలో కూడా ఇదే జరిగింది. తమ కొచ్చిన జాండిస్‌ గుర్తించక వీళ్లు.. అదే పనిగా మద్యం తాగడంతో.. ఆ వ్యాధి తీవ్రం అయింది. గుర్తించి ఆసుపత్రికి వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. అందుకే పచ్చ కామెర్లను నిర్లక్ష్యం చేయకండి! తప్పులేదు.. టాయిలెట్ ఏ రంగులో వస్తుందో చూసుకోండి. ఎక్కువ రోజులు పచ్చగా వస్తే అనుమానించండి. డాక్టర్ దగ్గరకు వెళ్లండి.

Follow us
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి