TOP9 ET: ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | NTRను గుర్తు చేస్తున్న జూనియర్ నటసింహం

Updated on: Sep 07, 2024 | 12:46 PM

దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా..! అందులో 200 కోట్ల రూపాయలను విజయ్‌ దళపతే.. రెమ్యునరేషన్ గా తీసుకున్నాడనే టాక్ ఉన్న సినిమా..! అలాంటి ఈ సినిమా.. ది గోట్ సినిమా.. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ దళపతికి ఊహించని షాక్ నిచ్చింది. ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్ 5న రిలీజ్ అయిన ఈ సినిమా ఓపెనింగ్స్‌లో తడబడింది. విజయ్ అంతకు ముందు సినిమా లియో డే1 148.5 క్రోర్ గ్రాస్ ను వసులు చేయగా..

01. Ram charan: ఫ్యాన్స్ బూతు పురాణం దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం. ఫ్యాన్స్ బూతు పురాణం దెబ్బకు గేమ్ ఛేంజర్‌ నుంచి అప్డేట్ వచ్చింది. ఇక గేమ్ చేంజర్‌ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ బయటికి రావడం లేదంటూ విసిగిపోయిన మెగా ఫ్యాన్స్‌.. రీసెంట్గా.. ఎక్స్లో డైరెక్టర్ శంకర్ పేరుతో కలిపి ఓ బూతు పదాన్ని ట్రెండ్ చేశారు. తమ అసహనాన్ని ఇలా వెళ్లగక్కారు. అయితే ఫ్యాన్స్‌ బూతు ట్యాగ్‌పై కాస్త నొచ్చుకున్న ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్‌ తమన్.. మెగా ఫ్యాన్స్‌ ను రెక్వెస్ట్ చేస్తూ.. ఓ ట్వీట్ చేశారు. మేకర్స్‌ను అర్థం చేసుకోవాలని.. డీగ్రేడింగ్ హ్యాష్‌ ట్యాగ్స్‌ ట్రెండ్‌ చేయడం మానుకోవాలని ఫ్యాన్స్‌కు సూచించారు. దాంతో పాటే త్వరలో గేమ్ చేంజర్‌ నుంచి బిగ్ అప్డేట్ రానుందంటూ.. మరో ట్వీట్ చేశారు. గేమ్‌ ఛేంజర్ హ్యాష్‌ ట్యాగ్‌ను మరో సారి ట్విట్టర్ ఎక్స్‌లో ట్రెండ్ అయ్యేలా చేశారు తమన్. 02.NTR: NTR ఫ్యాన్స్‌కు ఇది నిజంగా బ్యాడ్‌ న్యూస్.! Ntr ఫ్యాన్స్‌కు ఓ బ్యాడ్‌ న్యూస్.!! రీసెంట్‌గా రిలీజ్ అయి యూట్యూబ్‌నే షేక్ చేస్తున్న దావూదీ సాంగ్‌ను దేవర సినిమాలోని హై మూమెంట్ సిచ్యువేషన్లో చూస్తామనే.. చాలా మంది అనుకుంటున్నారు. సినిమాలో ఓ యాక్షనో.. లేక ఓ రొమాంటిక్ సన్నివేశం తర్వాత దావూదీ సాంగ్ వస్తుంది కావచ్చని, తారక్ ఫ్యాన్స్‌ థింక్ చేస్తున్నారు. అయితే వారి ఊహలకు భిన్నంగా.. ఈ సాంగ్‌...