TOP 9 ET: సారీ చెప్పినా నో.. రూ.100 కోట్ల దావాపై తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు

|

Oct 06, 2024 | 1:36 PM

కొండా సురేఖ పై 100 కోట్ల దావా వేసిన నాగార్జున.. తాజాగా దీనిపై మాట్లాడారు. వివాదం తర్వాత కొండా సురేఖ సమంత కు క్షమాపణలు చెప్పారని.. తనకు కానీ.. తన కుటుంబ సభ్యులకు కానీ క్షమాపణ చెప్పలేదన్నారు. అందుకే సురేఖపై క్రిమినల్ అండ్ పరువు నష్టం దావా వేసినట్టు ఆయన ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు ఒక వేళ సురేఖ తనకు క్షమాపణ చెప్పినా కేసును వెనక్కి తీసుకోబోం అంటూ.. గట్టిగా చెప్పారు కింగ్ నాగ్.

01.Nagarjuna: సారీ చెప్పినా నో.. రూ.100 కోట్ల దావాపై తగ్గని నాగ్

కొండా సురేఖ పై 100 కోట్ల దావా వేసిన నాగార్జున.. తాజాగా దీనిపై మాట్లాడారు. వివాదం తర్వాత కొండా సురేఖ సమంత కు క్షమాపణలు చెప్పారని.. తనకు కానీ.. తన కుటుంబ సభ్యులకు కానీ క్షమాపణ చెప్పలేదన్నారు. అందుకే సురేఖపై క్రిమినల్ అండ్ పరువు నష్టం దావా వేసినట్టు ఆయన ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు ఒక వేళ సురేఖ తనకు క్షమాపణ చెప్పినా కేసును వెనక్కి తీసుకోబోం అంటూ.. గట్టిగా చెప్పారు కింగ్ నాగ్.

02.RGV: మళ్లీ కొండాను రెచ్చగొట్టిన ఆర్జీవీ

ఏ వివాదంలోనైనా.. తనకంటూ స్పేస్ క్రియేట్ చేసుకునే అలవాటు ఉన్న రామ్ గోపాల్ వర్మ.. కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యల విషయంలోనూ ఇదే చేస్తున్నారు. ఈ వివాదాన్ని రక రకాల యాంగిల్స్‌లో.. చూస్తూ.. తన కొచ్చిన ఐడియాలతో ట్వీట్స్‌ చేస్తున్నారు. ఇప్పటికే కొండాది తప్పని.. కాదు కాదు.. కొండాదే ఒప్పంటూ రెండు ట్వీట్స్ చేసిన ఆర్జీవీ.. ఇప్పుడు కొండా సురేఖ మోస్ట్ కన్ఫ్యూజ్డ్‌ పర్సన్ అనే అర్థం వచ్చేలా ఓ ట్వీట్ చేశారు. కొండా సురేఖ సమంతకి క్షమాపణ చెప్పటమెంటి??? అక్కడ అత్యంత జుగుప్సాకరంగా అవమానించింది నాగార్జునని.. మరి సమంతను అవమానించడం ఎలా అయింది??? వాళ్లిద్దరి కోసమే కాకుండా ఫిలిం ఇండస్ట్రీ లోవుండే అందరి కోసం ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుని మరచిపోలేని గుణపాఠం నేర్పాలి. అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు ఆర్జీవి.

03.charan: గేమ్ ఛేంజర్.. థర్డ్ సాంగ్ లెక్క వేరే?

ఇప్పటికే గేమ్ చేంజర్‌ మూవీ నుంచి రిలీజ్ అయిన రా మచ్చా.. మూవీ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. యూట్యూబ్‌లో 50 మిలియన్స్ వ్యూస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇక ఇప్పుడు థర్డ్ సాంగ్ గురించి ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నుంచి బిగ్ హింట్ వచ్చింది. ఈనెల లోనే ఈ సాంగ్ రానుందనే న్యూస్ బయటికి వచ్చింది. అయితే ఈసారి పక్కా మెలోడి ఉంటుందని తమన్ నుంచి ఓ క్లారిటీ. అంతేకాదు ఈ థర్డ్ సింగిల్‌లో చరణ్, అంజలి జోడీగా కనిపించబోతున్నారని కూడా ఓ టాక్ నడుస్తోంది.. ఫిల్మ్ సర్కిల్లో..!

04.gopichand: ప్రభాస్‌కు విలన్‌గా నటిస్తా..!

ఇప్పుడు స్టార్ హీరోలు కూడా విలన్‌గా చేస్తున్నారు. దిమ్మతిరిగే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు. అయితే గతంలోనే మంచి విలన్‌గా నామ్ కమాయించిన గోపీచంద్ మాత్రం ఇప్పుడు హీరోగా బిగ్ సక్సెస్ కోసం కష్టపడుతున్నాడు. విలన్‌ వేషాల జోలికి పోకుండా హీరోగా కంటిన్యూ అవుతున్నాడు. ఇక ఈక్రమంలోనే తాను విలన్ వేషాలకు వేయడానికి రెడీ అంటూ చెప్పాడు. అయితే ఓన్లీ ప్రభాస్‌ సినిమాలో మాత్రమే విలన్‌గా చేస్తానంటూ కండీషన్ పెట్టాడు. తన మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాడు ఈ స్టార్ హీరో.

05. rajini: రజినీ ఆరోగ్యంపై రూమర్స్ ప్రచారం చేయొద్దు

రజినీ ఆరోగ్యం పై ఎలాంటి రూమర్స్ ప్రచారం చేయొద్దు అంటూ తాజాగా ఫైర్ అయ్యారు డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. రజినీ ఆరోగ్యం బానే ఉందని.. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఆయన ఆసుపత్రిలో ఏం చేరలేదన్నారు. సర్జరీ చేయించుకోవాలని నెల రోజుల కిందటే కూలీ వైజాగ్ షెడ్యూల్‌లో తమకు చెప్పారన్నాడు. ఏదో మెడికల్ ఎమర్జెన్సీ మీదే ఉన్నపళంగా ఆయన ఆసుపత్రిలో జాయిన్ అయినట్టు.. ఆయన ఆరోగ్యం విషమించినట్టు అనవసరంగా రూమర్లు క్రియేట్ చేయొద్దు అంటూ రిక్వెస్ట్ చేశారు.ఇలాంటి రూమర్స్ వల్ల తమలో ఆందోళన, నిరాశ కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు లోకేష్.

06.darshan: రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది: దర్శన్‌

రేణుకాస్వామి ఆత్మ దర్శన్‌ను వెంటాడుతోందా..? అంటే అవుననే అంటున్నాడు ఈ స్టార్ హీరో. రేణుకాస్వామి హ‌త్య కేసులో క‌న్నడ న‌టుడు ద‌ర్శన్ విచార‌ణ ఖైదీగా ప్రస్తుతం బ‌ళ్లారి జైల్లో ఉన్నారు. అయితే, జైల్లో హీరో ద‌ర్శన్‌ గ‌త కొన్నిరోజులుగా నిద్రలేని రాత్రులు గ‌డుపుతున్నారని తెలుస్తోంది. రేణుకాస్వామి ఆత్మ త‌న‌ని వెంటాడుతోంద‌ని, రోజూ రాత్రి వేళ త‌న క‌ల‌లోకి వ‌చ్చి భ‌య‌పెడుతోంద‌ని జైలు అధికారులకు చెప్పిన‌ట్లు స‌మాచారం. ఆ భ‌యంతోనే త‌న‌కు రాత్రుళ్లు నిద్ర ప‌ట్టడం లేద‌ని.. జైలు అధికారుల‌కు చెప్పార‌ట. ఈ నేప‌థ్యంలోనే తాను ఒంటరిగా ఉండలేకపోతున్నానని, త‌న‌ను వెంట‌నే బెంగ‌ళూరు జైలుకు త‌ర‌లించాల్సిందిగా అధికారుల‌ను వేడుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, ద‌ర్శన్ అర్ధరాత్రి స‌మ‌యంలో నిద్రలో క‌ల‌వ‌రిస్తూ, గ‌ట్టిగా అరుస్తున్నాడ‌ని తోటి ఖైదీలు కూడా ఫిర్యాదు చేసిన‌ట్లు స‌మాచారం.

07.pawan: పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు న‌మోదైంది. త‌మిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ను ఉద్దేశించి పవ‌న్ క‌ళ్యాణ్ చేసిన‌ అనుచిత వ్యాఖ్యలకు గాను మధురైలోని కమిషనరేట్ లో… వాంజినాధ‌న్ అనే లాయర్ కంప్లైంట్ ఇచ్చాడు. స‌నాతన ధర్మం పై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను పవన్ వక్రీకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంట‌నే అత‌డిపై చ‌ర్యలు తీసుకోవాలని కోరాడు.

08.Prabhas: రాజాసాబ్ డైరెక్టర్‌కు ప్రభాస్‌ కండీషన్‌?

తీరిక లేకుండా వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తూ పోతున్న ప్రభాస్‌.. తాజాగా రాజాసాబ్ డైరెక్టర్‌కు మారుతికి కొన్ని కండీషన్ పెట్టారట. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజాసాబ్‌ సినిమాలోని తన షూట్‌ను నవంబర్‌ లాస్ట్ వీక్ వరకు ముగించాలన్నారట. ఇక ఈ సినిమా షూటింగ్‌ తర్వాత తాను..హను- ప్రభాస్‌ షూటింగ్‌లోనూ.. మంచు విష్ణు కన్నప్ప షూటింగ్‌లోనూ పాల్గొనాలని థింక్ చేస్తున్నారట ప్రభాస్‌.

09.nag: నాగార్జున పై కేసు నమోదు

అక్కినేని నాగార్జునకు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆయనపై మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తమ్మిడికుంటలో కబ్జా చేసి Nకన్వెన్షన్‌‌ ను నిర్మించడంపై సినీ హీరో నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. ‘జనం కోసం’ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి. ఫిర్యాదును స్వీకరించిన మాదాపూర్‌ పోలీసులు లీగల్‌ ఒపీనియన్‌కు పంపించారు. ఇక ఇటీవల నాగార్జునకు చెందిన N కన్వెన్షన్‌‌ను హైడ్రా కూల్చివేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.