టాలీవుడ్ షూటింగ్ అప్‌డేట్స్.. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న స్టార్స్

Updated on: Oct 29, 2025 | 1:48 PM

టాలీవుడ్ తారలు వాతావరణ పరిస్థితులను లెక్క చేయకుండా తమ తదుపరి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. నాని "ది ప్యారడైజ్", ప్రభాస్ "ఫౌజీ", మహేష్-రాజమౌళి సినిమా, అల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్ట్, పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్" వంటి పలు సినిమాల షూటింగ్‌లు హైదరాబాద్, ముంబైలలో శరవేగంగా జరుగుతున్నాయి.

టాలీవుడ్ స్టార్స్ వాతావరణ పరిస్థితులను పట్టించుకోకుండా వరుస షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. తమ తదుపరి ప్రాజెక్టులను వీలైనంత త్వరగా థియేటర్లలోకి తీసుకురావడానికి వారు తీవ్రంగా శ్రమిస్తున్నారు. చాలా మంది హీరోలు ప్రస్తుతం తమ సినిమాల చిత్రీకరణలో నిమగ్నమై ఉన్నారు. నాని హీరోగా తెరకెక్కుతున్న “ది ప్యారడైజ్” షూటింగ్ నేటివ్ స్టూడియోలో వేగంగా సాగుతోంది. అక్కడే శర్వానంద్ హీరోగా రూపొందుతున్న “భోగి” సినిమా కోసం సెట్ సిద్ధం చేస్తున్నారు. ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న “ఫౌజీ” వర్క్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. శంకర్ వరప్రసాద్ గారి సినిమా షూటింగ్ అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ తో పాటు శంషాబాద్‌లోని రాజ్ ప్యాలెస్‌లో చిత్రీకరిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Samantha: సమంత – రాజ్‌ కన్ఫర్మ్ చేసినట్టేనా.. పూజలో కలిసి పాల్గొన్న జంట

హద్దులు చెరిపేస్తున్న క్రేజీ కెప్టెన్స్‌.. వాళ్ళ అడుగులు పాన్ ఇండియా వైపే

డిసెంబర్‌లో సినిమా జాతర.. అంచనాలు పెంచుతున్న మూవీస్

బాహుబలి ది ఎపిక్‌ ప్రమోషన్స్‌లో ట్విస్ట్‌.. నెక్స్ట్ లెవల్‌ స్కెచ్ వేసిన జక్కన్న

Shruti Haasan: నార్త్, సౌత్‌కున్న తేడాని గమనించిన శృతిహాసన్