బాక్సాఫీస్ షేక్ చేయడానికి రెడీ అవుతున్న హీరోలు.. షూటింగ్ అప్డేట్స్ ఇవే

Updated on: Oct 08, 2025 | 3:43 PM

చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్ దగ్గర వచ్చిన సినిమాలు సందడి చేస్తున్నాయి.. అదే సమయంలో సినిమాలను థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు లొకేషన్‌లలో హీరోలు కూడా కష్టపడుతున్నారు. ఎవరో ఒకరిద్దరు మినహా.. ఏ హీరోను తీసుకున్నా ఆన్ సెట్స్‌లోనే బిజీగా ఉన్నారు. మరి ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతుందో చూద్దామా..? హలో నేటివ్ స్టూడియోలో రామ్ నటిస్తున్న ఆంధ్రా కింగ్ తాలూకతో పాటు నాని ప్యారడైజ్, రవితేజ - మాస్‌ జాతర షూటింగ్స్‌ జరుగుతున్నాయి.

శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న భోగి సినిమా కోసం అక్కడే సెట్‌ సిద్ధం చేస్తున్నారు. రామ్ చరణ్ పెద్ది షూటింగ్ రాజేంద్ర నగర్‌లో జరుగుతుండగా.. ప్రభాస్, మారుతి కాంబోలో వస్తున్న ది రాజాసాబ్‌ పాటల చిత్రీకరణ యూరప్‌లో జరుగుతోంది. మన శంకరవరప్రసాద్‌ గారు షూటింగ్‌ శంషాబాద్‌లోని రాజ్‌ ప్యాలెస్‌లో జరుగుతోంది. మహేష్‌, రాజామౌళి SSMB29 షూటింగ్ RFCలో జరుగుతున్నాయి. అల్లు అర్జున్‌, అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌ ముంబైలో జరుగుతోంది. రవితేజ, కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శంకరపల్లి పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్న ఎన్‌సీ 24 షూటింగ్‌లో పాల్గొంటున్నారు నాగచైతన్య. విజయ్ సేతుపతి, పూరీ జగన్నాథ్ సినిమా షూట్ కూడా అక్కడే జరుగుతుంది. సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమా షూటింగ్ తుక్కుగూడలో జరుగుతుంది. ప్రశాంత్ వర్మ నిర్మాతగా పూజ అపర్ణ కొల్లూరు తెరకెక్కిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం మహాకాళి షూటింగ్ ముచ్చింతల్‌లో జరుగుతోంది. మమ్ముట్టి, మోహన్‌లాల్‌ హీరోలుగా తెరకెక్కుతున్న పేట్రియాట్ షూటింగ్‌ ఆర్టీసీ భవన్‌లో జరుగుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వెయ్యి కోట్ల వసూళ్ల రేసులో ఇండియన్ సినిమా

అంతకు మించి అనేలా ఉండబోతున్న AA 22.. హ్యాట్రిక్ ప్లాన్ చేస్తున్న అల్లు అర్జున్..

Baahubali: బాహుబలి టీంలో రీ రిలీజ్ జోష్.. క్రేజ్ మామూలుగా లేదుగా

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు.. మరో బ్లాక్ బస్టర్ పక్కా

దెబ్బ మీద దెబ్బ.. మూసీవాసులకు నిద్రలేకుండా చేస్తున్న పాములు.. ఇంత ఉన్నాయేంటి మావ