స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇస్తున్న 30 ప్లస్ బ్యూటీస్

Edited By:

Updated on: Jan 05, 2026 | 4:07 PM

2026లో టాలీవుడ్‌పై సీనియర్ హీరోయిన్ల మూకుమ్మడి దండయాత్రకు సిద్ధమయ్యారు. నయనతార, రష్మిక, సమంత, త్రిష, సాయి పల్లవి వంటి అగ్ర తారలు భారీ ప్రాజెక్ట్‌లతో రీఎంట్రీ ఇస్తున్నారు. పలు కీలక పాత్రలు, బహుభాషా చిత్రాలతో అభిమానులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. గ్యాప్ ఇచ్చినా, తమ సత్తా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించేందుకు వీరంతా పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగుతున్నారు.

గ్యాప్ ఇచ్చాం కదా అని మ్యాప్‌లో కనబడకుండా పోతాం అనుకుంటున్నారేమో..? ఒక్కసారి మేం ఫోకస్ చేస్తే మాకు పోటీ ఇచ్చేదెవరు.. ఎదురు నిలబడేదెవరు అంటున్నారు సీనియర్ హీరోయిన్లు. వాళ్లు అంటున్నారని కాదు గానీ.. నిజంగానే సీనియర్స్ అంతా 2026లో టాలీవుడ్‌పై మూకుమ్మడి దండయాత్ర చేస్తున్నారు. మరి వాళ్ల కాన్పిడెన్స్ ఏంటో చూద్దామా..? సీనియర్ హీరోయిన్లంతా మరోసారి తమ తడాఖా చూపించడానికి రెడీగా ఉన్నారు. కాస్త గ్యాప్ ఇచ్చినట్లే కనిపిస్తున్నారు గానీ ఒక్కొక్కరి ప్లానింగ్ మాత్రం నెక్ట్స్ లెవల్‌లో ఉంది. 2026లో ఒక్కొక్కరి నుంచి కనీసం రెండు మూడు సినిమాలకు తగ్గకుండా వస్తున్నాయి. అందులో నయన్ టాప్‌లో ఉన్నారు.. సంక్రాంతి నుంచే దండయాత్ర మొదలుపెడుతున్నారు ఈ బ్యూటీ. పండక్కి మన శంకరవరప్రసాద్ గారు అంటూ వస్తున్న నయన్.. 2026లోనే రెక్కాయ్, డియర్ స్టూడెంట్స్, టాక్సిక్, మూకూతి అమ్మన్ 2, మన్నన్ గట్టి లాంటి సినిమాలతో రానున్నారు. ఇక పుష్ప 2 తర్వాత చిన్న బ్రేక్ ఇచ్చిన రష్మిక.. గాళ్ ఫ్రెండ్‌తో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. రెయిన్ బో, కాక్ టైల్ 2, మైసా సినిమాలతో రానున్నారు. ఇందులో మైసా టీజర్ అదిరింది. సమంత సైతం చాలా రోజుల తర్వాత టాలీవుడ్‌పై ఫోకస్ పెంచేసారు. నిర్మాతగా చేసిన తొలి సినిమా శుభం గతేడాది విడుదలైంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగానే తెలుగులో ఇకపై గ్యాప్ లేకుండా నటిస్తానన్నారు స్యామ్. సొంత ప్రొడక్షన్‌లో చేస్తున్న మా ఇంటి బంగారంలో నటిస్తున్నారు స్యామ్. దాంతో పాటు భర్త రాజ్ నిడిమోరు దర్శకత్వంలో రక్త్ బ్రహ్మాండ్ సిరీస్ చేస్తున్నారు. త్రిష కూడా చిరంజీవి విశ్వంభరలో నటిస్తున్నారు. సాయి పల్లవి కూడా రామాయణ్‌తో పాటు అమీర్ ఖాన్ కొడుకు సినిమాలతో రానున్నారు. ఇక తమన్నా తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అక్కడ ఆమె 3 సినిమాలు చేస్తున్నారు. మొత్తానికి సీనియర్స్ అంతా 2026లో దండయాత్రకు సిద్ధమవుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sandeep Vanga: స్పిరిట్ అప్‌డేట్.. వంగా దెబ్బకు ఫ్యూజులు ఔట్

ఒకేసారి మూడు సినిమాలు ప్రకటించిన యంగ్ హీరో

Published on: Jan 05, 2026 04:07 PM