Dussehra Movie Posters: పండక్కి గుడ్ న్యూస్ చెప్పిన హీరోలు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి.

|

Oct 25, 2023 | 11:00 AM

పండగ వచ్చిందంటే చాలు.. తమ హీరోల సినిమాల నుంచి అప్‌డేట్స్ వస్తాయని ఎదురు చూస్తుంటారు. మరి వాళ్ళు అంతగా వెయిట్ చేస్తున్నపుడు వదిలేస్తే ఏం బాగుంటుంది చెప్పండి..? అందుకే మన హీరోలు కూడా మంచి మనసు చేసుకుని అప్‌డేట్స్‌తో పాటు గుడ్ న్యూస్‌లు బాగానే చెప్పారు. మరి ఏంటా న్యూస్‌లు.. అసలు దసరా సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్స్ ఏంటి..? ఇవన్నీ ఎక్స్‌క్లూజివ్‌లో చూద్దాం..

పండగ వచ్చిందంటే చాలు.. తమ హీరోల సినిమాల నుంచి అప్‌డేట్స్ వస్తాయని ఎదురు చూస్తుంటారు. మరి వాళ్ళు అంతగా వెయిట్ చేస్తున్నపుడు వదిలేస్తే ఏం బాగుంటుంది చెప్పండి..? అందుకే మన హీరోలు కూడా మంచి మనసు చేసుకుని అప్‌డేట్స్‌తో పాటు గుడ్ న్యూస్‌లు బాగానే చెప్పారు. మరి ఏంటా న్యూస్‌లు.. అసలు దసరా సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్స్ ఏంటి..? ఇవన్నీ ఎక్స్‌క్లూజివ్‌లో చూద్దాం.. చూస్తున్నారుగా.. ఇవన్నీ దసరా సందర్భంగా మన దర్శక నిర్మాతలు ఇచ్చిన అప్‌డేట్స్ అండ్ చెప్పిన గుడ్ న్యూస్‌లు. చాలా రోజులుగా వేచి చూస్తున్న అభిమానులకు ఒకేసారి వింధు భోజనం పెట్టేసారు మేకర్స్. అయితే ప్రభాస్ ఫ్యాన్స్‌కు మాత్రం మళ్లీ నిరాశ తప్పలేదు. ఆయన పుట్టిన రోజు అయినా.. ఎలాంటి టీజర్ కానీ, పోస్టర్స్ కానీ విడుదల చేయలేదు సలార్, కల్కి టీమ్స్. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నుంచి కూడా దసరాకు ఎలాంటి అప్‌డేట్ రాలేదు. పాట విడుదలవుతుందని చెప్పినా.. చివరి నిమిషంలో డ్రాప్ అయ్యారు మేకర్స్. అయితే చరణ్ నుంచి రాకపోయినా.. చిరంజీవి నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. ఆయుధ పూజ రోజు రీ రికార్డింగ్‌తో వశిష్ట సినిమాను మొదలుపెట్టారు చిరు. చాలా ఏళ్ళ తర్వాత మెగాస్టార్ సినిమాకు కీరవాణి అందిస్తున్నారు. దసరా సందర్భంగా చాలా మంది దర్శకులు ఆయుధ పూజకు సంబంధించిన లుక్స్ విడుదల చేసారు. అందులో పవన్ కళ్యాణ్ ఉస్తాద్, ఓజి కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఓజి లుక్ అయితే నెక్ట్స్ లెవల్‌లో ఉంది. అలాగే గుంటూరు కారం పోస్టర్ విడుదల చేసారు. ఎప్పట్లాగే మరోసారి స్మోకింగ్ లుక్‌నే రిలీజ్ చేసారు త్రివిక్రమ్ అండ్ టీం. త్వరలోనే ఫస్ట్ సింగిల్ విడుదల చేస్తామని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ దేవర లుక్‌లో ఆయుధాన్ని హైలైట్ చేసారు. అలాగే నాని కొత్త సినిమా సరిపోదా శనివారం దసరా సందర్భంగానే మొదలైంది. సుధీర్ బాబు హరోం హర పోస్టర్‌లోనూ ఆయుధ పూజనే చూపించారు. పండగ కానుకగా నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినర్ మ్యాన్ టీజర్ అప్‌డేట్ ఇచ్చారు. మొత్తానికి ప్రభాస్, చరణ్ తప్ప.. దసరాకు హీరోలందరి నుంచి న్యూస్‌లు వచ్చాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..