మల్టీప్లెక్స్ బిజినెస్.. మూడు పువ్వులు ఆరు కాయలు

Edited By: Phani CH

Updated on: Dec 10, 2025 | 4:44 PM

టాలీవుడ్ హీరోలు కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, మల్టీప్లెక్స్ వ్యాపారంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఏషియన్ సినిమాస్‌తో కలిసి మహేష్ బాబు (AMB), అల్లు అర్జున్ (AAA), రవితేజ (ART), విజయ్ దేవరకొండ (AVD) వంటి ప్రముఖులు కొత్త థియేటర్లను నిర్మిస్తున్నారు. బెంగళూరు, కొకపేట, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వంటి ప్రదేశాలలో ఈ మల్టీప్లెక్సులు ప్రారంభం కానున్నాయి, వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాయి.

హీరో ఎవరైనా కానీ.. వాళ్ల పేరు ముందు ఇంటిపేరులా ఒకరి పేరు మాత్రం కామన్‌గా ఉంటుంది.. అదే ఏషియన్. టాలీవుడ్ హీరోలందర్నీ కబ్జా చేస్తున్నారు వాళ్లు. మన హీరోలతో కలిసి బిజినెస్‌లు చేస్తున్నారు. ఆల్రెడీ ఓసారి జత కట్టిన వాళ్లతోనే కలిసి మళ్లీ మళ్లీ మల్టీప్లెక్సులు కడుతున్నారు. తాజాగా మహేష్, అల్లు అర్జున్ రెండో మల్టీప్లెక్స్ కట్టేసారు. మరి ఆ థియేటర్స్ ఎక్కడున్నాయి..? వాటి ముచ్చట్లేంటి..? మన హీరోలకు సినిమాలు మాత్రమే కాదు.. బిజినెస్ కూడా ముఖ్యమే. అందుకే ఇక్కడ వచ్చిన డబ్బుల్ని అక్కడ పెడుతున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది మల్టీప్లెక్స్ బిజినెస్‌పై మనసు పారేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలు ఈ బిజినెస్‌లో ఉన్నారు. మహేష్ బాబు, ఏషియన్ కలిసి బెంగళూరులో AMB కట్టారు.. డిసెంబర్ 16న ఈ మల్టీప్లెక్స్ ఓపెన్ కానుంది. 9 స్క్రీన్స్‌తో రాబోతుంది బెంగళూరులో AMB సినిమాస్. ఇండియాలోనే రెండో అతిపెద్ద స్క్రీనింగ్ ఇక్కడుంది. అదే విధంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోనూ మరో AMB ఓపెనింగ్‌కు సిద్ధంగా ఉంది. ఇక అల్లు అర్జున్ సినిమాస్ కోకాపేటలోనూ రెడీ అవుతుంది. ఇండియాలోనే అతిపెద్ద స్క్రీన్‌తో రాబోతుంది ఈ మల్టీప్లెక్స్. ఇక రవితేజ ART గతేడాదే మొదలైంది. ఏషియన్ వాళ్లతో కలిసి రవితేజ ఈ మల్టీప్లెక్స్ నిర్మించారు. మొత్తం 6 స్క్రీన్స్‌తో వచ్చిన మల్టీప్లెక్స్‌కు మంచి అప్లాజ్ వస్తుంది. విజయ్ దేవరకొండ ఆల్రెడీ మల్టీప్లెక్స్ బిజినెస్‌లో ఉన్నారు. ఏషియన్ వాళ్లతో కలిసి మహబూబ్‌ నగర్‌లో AVD సినిమాస్ నిర్మించారు రౌడీ బాయ్. ఇది సూపర్ సక్సెస్ ఫుల్‌గా నడుస్తుంది. మొత్తానికి మన హీరోల మల్టీప్లెక్స్ బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా నడస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Akhanda 2: అఖండ 2 ఈ వారమా..3 రోజుల్లో సాధ్యమేనా

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్లాన్ B.. ఉస్తాద్ తర్వాత రీ ఎంట్రీ

Gold Price Today: అయ్యో.. పసిడి మళ్లీ పరుగులు పెడుతోంది.. ఇవాళ తులం ఎంతంటే

స్క్రిప్ట్‌తో రండి, సినిమా పూర్తి చేసుకెళ్లండి.. సినిమావారికి CM ఆఫర్

అఖండ-2 రిలీజ్‌ ఎఫెక్ట్‌.. బాధలోకి మోగ్లీ డైరెక్టర్

Published on: Dec 10, 2025 04:44 PM