Ajay Bhupathi: పద్దతిపాడు లేని మనిషి.! బాలీవుడ్ స్టార్‌పై అజయ్‌ భూపతి సీరియస్.

|

Aug 22, 2024 | 11:01 AM

పాన్ ఇండియా రారాజు.. బాక్సాఫీస్ కింగ్ అంటూ అభిమానులు రకరకాల పేర్లతో పిలుచుకుంటున్నారు. మరోవైపు బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ అతడితో సినిమాలు చేసేందుకు పోటీపడుతున్నారు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీకి షేక్ చేసిన ఆ హీరో.. ఇప్పుడు పాన్ ఇండియా ప్రపంచాన్ని ఏలేస్తున్నాడు.

పాన్ ఇండియా రారాజు.. బాక్సాఫీస్ కింగ్ అంటూ అభిమానులు రకరకాల పేర్లతో పిలుచుకుంటున్నారు. మరోవైపు బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ అతడితో సినిమాలు చేసేందుకు పోటీపడుతున్నారు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీకి షేక్ చేసిన ఆ హీరో.. ఇప్పుడు పాన్ ఇండియా ప్రపంచాన్ని ఏలేస్తున్నాడు. వరుస ప్లాపులతో అభిమానులు నిరాశ చెందుతున్న వేళ ఏకంగా 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి మరోసారి సంచలనం సృష్టించాడు. ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా ? యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. అలాంటి ఈ స్టార్‌ను బాలీవుడ్ యాక్టర్ అర్షద్ వార్సీ కామెంట్ చేశాడు. కల్కి మూవీలోని ప్రభాస్‌ లుక్‌ను జోకర్ తో పోల్చాడు. అయితే ఈ కామెంట్స్‌ చేసిన ఈ హీరోకు.. ఇప్పుడు టాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్ అజయ్‌ బూపతి సీరియస్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా బాలీవుడ్ స్టార్‌కు బిగ్ పంచ్ ఇచ్చాడు.

ఇంతకీ ఈస్టార్ డైరెక్టర్ ఏం ట్వీట్ చేశారంటే ” #ప్రభాస్.. భారతీయ సినిమాని ప్రపంచ ప్రేక్షకులకు తీసుకెళ్లడానికి ఏదైనా చేయగల వ్యక్తి. అలాంటి మనిషి మన జాతికే గర్వకారణం. ఆ చిత్రంపై, అలాగే అతడిపై మీ దృష్టిలో అసూయను మేము చూస్తున్నాం. ఆయన సినిమాల పట్ల మీకున్న జెలసీ కనిపిస్తుంది. మీ అభిప్రాయాన్ని చెప్పడానికి ఒక పరిమితి, ఒక పద్దతి ఉంటుంది. అలాగే మీరు ఫేడ్ అవుట్ అయ్యారనే బాధ కూడా కనిపిస్తుంది” అంటూ సెటైర్ వేశాడు. ప్రస్తుతం అర్షద్ వర్సి చేసిన కామెంట్స్ పై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.