వరుస షూటింగ్స్ తో షేక్ అవుతున్న లొకేషన్స్..

Edited By: Phani CH

Updated on: Nov 19, 2025 | 3:01 PM

టాలీవుడ్ సినీ పరిశ్రమ ఈ వారం షూటింగ్‌లతో సందడిగా మారింది. అగ్ర తారలు ప్రభాస్, చిరంజీవి, మహేష్ బాబు, అల్లు అర్జున్, నాని, సాయి ధరమ్ తేజ్ వంటి హీరోల చిత్రాలు వివిధ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. పలు భారీ బడ్జెట్ సినిమాలు అజీజ్ నగర్, మైసూర్, రామోజీ ఫిలిం సిటీ వంటి లొకేషన్లలో శరవేగంగా షూటింగ్స్ జరుపుకుంటున్నాయి.

వారం తిరిగేలోపు కొత్త సినిమాలు.. కొత్త సెట్లు అంటూ కళకళలాడుతూ ఉంటుంది ఇండస్ట్రీ. ఆదివారం సెలవు తీసుకుని సోమవారం మరింత ఫ్రెష్ గా సెట్స్ కి వెళ్తుంటారు సినీ జనాలు. ఈ వారం ఏ సినిమా ఏ సెట్లో ఉంది? చూసేద్దాం వచ్చేయండి. ప్రభాస్ – మారుతి కాంబో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమా బాలెన్స్ షూటింగ్ అజిజ్ నగర్ లో జరుగుతోంది . ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా షూటింగ్ ఈ నెల 20 నుంచి మైసూర్ లో ప్రారంభం కానుంది. చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న మన శంకర ప్రసాద్ గారు సినిమా షూటింగ్ సికింద్రాబాద్ కి షిఫ్ట్ అయింది. మహేష్ బాబు – రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న వారణాసి షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతుంది. అల్లు అర్జున్ – అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ముంబై లో జరుగుతుంది. రవితేజ – కిషోర్ తిరుమల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకర్స్ లో స్పీడందుకుంది.అల్యూ మినియమ్‌ ఫ్యాక్టరీలో మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో వరుణ్ తేజ్ నటిస్తున్న సినిమా షూటింగ్ జరుగుతోంది . నాగచైతన్య హీరోగా కార్తీక్ వర్మ దండు డైరెక్షన్ లో రూపొందుతున్న సినిమా కూడా అక్కడే శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. సూర్య – వెంకీ అట్లూరి సినిమా షూటింగ్ కూడా అక్కడే జరుగుతోంది. విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ కొల్లూరు రైల్వే స్టేషన్ లో కంటిన్యూ అవుతోంది. సాయి దుర్గ తేజ్‌ సంబరాల ఏటి గట్టు సినిమా షూటింగ్ తుక్కుగూడ లో మొదలవుతుంది. ప్రశాంత్ వర్మ నిర్మాతగా పూజ అపర్ణ కొల్లూరు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మహా కాళి చిత్రం ముచ్చింతల్ లో జరుగుతోంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో నాని నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ హలో నేటివ్‌ స్టూడియోలో జరగుఉతోంది. సత్యసాయి ఆర్ట్స్ మూవీ భోగి సెట్‌వర్క్ కూడా అక్కడ జోరందుకుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Top9 ET: ‘వారణాసి’ టైటిల్‌ వివాదం జక్కన్నకు దెబ్బ మీద దెబ్బ

పాపులారిటీ ఏమో కానీ.. తన భర్త విషయంలో ఈ నటికి తీవ్ర బాధ

Babar Azam: బాబర్‌పై ఐసీసీ కొరడా.. లెవల్ 1 నిబంధనను ఉల్లంఘించినందుకు ఫైన్‌

5 ఫోర్లు, 3 సిక్సర్లతో బుడ్డోడి బీభత్సం

బంధువు ఆఖరి చూపు కోసం వెళ్లి వస్తూ అనంత లోకాలకు..