TOP 9 ET: ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఎన్టీఆర్..

Updated on: Jan 30, 2026 | 12:30 PM

మన శంకర వర ప్రసాదు గారు సినిమా తర్వాత ఫుల్ జోష్‌ మీదున్న మెగాస్టార్.. రీసెంట్‌గా కొంత మంది సీనిరియస్ ఫిల్మ్ జర్నలిస్టులతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే మరోసారి తనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని మరో సారి స్పష్టం చేశారు. ఇటీవల తాను దావోస్ వెళ్లడం యాదృచ్ఛికంగా జరిగిందన్న చిరు.. తనకు అన్ని పార్టీల నేతలు మిత్రులే అంటూ చెప్పుకొచ్చారు. సినిమా, రాజకీయం రెండు రంగాలను నెట్టుకురావడం తనకు సాధ్యం కాలేదని.. కానీ తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు ఆ సమర్థత ఉందంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు చిరు.

ఎప్పుడూ ఫిట్‌గా.. ఎనర్జిటిక్‌గా ఉండే యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇప్పుడు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఎట్ ప్రజెంట్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. ఆ సినిమా కోసం తెగ కష్టపడుతున్నారట. వరుసగా.. రాత్రుళ్లు.. తీవ్ర చలిలో.. ఈ సినిమా కోసం భారీ యాక్షన్ సన్నివేశాలలో పర్ఫార్మె చేస్తున్నారట. దీంతో తారక్ చలి జర్వం భారిన పడినట్టుగా ఇన్‌సైడ్ టాక్. అంతేకాదు జ్వరానికి తోడు.. తాను ఫాలో అయ్యే డైట్ వల్ల కూడా.. ఎన్టీఆర్ శరీరం బలహీనంగా మారిందని.. దీంతో డాక్టర్ల సూచన మేరకు ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలియడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నెట్టింట ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ హీరో త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మందుకు డబ్బుల్లేక.. ఆర్టీసీ బస్ కాజేశాడు.. మహానుభావుడు

టీడీపీ జెండాతో సెల్‌ టవర్‌ ఎక్కిన వ్యక్తి.. సత్యసాయి జిల్లాలో హైటెన్షన్

Bhagavanth Kesari Sequel: భగవంత్‌ కేసరికి సీక్వెల్‌.. అరిపించే న్యూస్ చెప్పిన అనిల్

99 రూపాయల సినిమా.. సూపర్ ప్లాన్ గురూ

Spirit: స్పిరిట్‌లో చిరంజీవి.. ఇదిగో మెగా క్లారిటీ