TOP 9 ET News: స్టేడియంలో చిరంజీవి, సుకుమార్.అంబటి చీప్ కామెంట్స్
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా.. దుబాయ్ వేదికగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఎప్పటిలానే ఇండియన్ టీం పాకిస్తాన్ టీంను చిత్తుగా ఓడించింది. ఇక ఈ విషయం పక్కకు పెడితే.. ఈ మోస్ట్ అవేటెడ్ మ్యాచ్‌ను చూసేందుకు మన టాలీవుడ్ మెగాస్టార్ చిరు , పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ స్టేడియానికి వెళ్లారు. స్టేడియంలోని స్క్రీన్స్ పై మెరిసారు.
అయితే ఆ టైంలో కామెంట్రీ చేస్తున్న అంబటి.. మన తెలుగు స్టార్స్ ను స్క్రీన్ పై చూడగానే కాస్త కాంట్రో కామెంట్స్ చేశాడు. పబ్లిసిటీ కోసమే ఇలాంటి మ్యాచెస్‌కు వస్తారంటూ.. ఆన్ రికార్డ్ అనేశాడు. ఇక ఇది ఎయిర్ కావడంతో.. అది కాస్తా నెట్టింట వైరల్ అవడంతో.. తెలుగు వాళ్లు ఫీలవుతున్నారు. అంబటి చీప్ కామెంట్స్ పై ఫైర్ అవుతూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. అంబటి తీరును తప్పు పడుతున్నారు. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా అంటే ఆ రేంజే వేరన్నట్టు. అయితే ఈ రేంజ్‌కు తొందర్లోనే రీచ్ అయిన సందీప్ రెడ్డి వంగా.. రెబల్ స్టార్ ప్రభాస్‌తో స్పిరిట్ సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలెట్టాడు. జనవరి ఫస్ట్ వీక్ నుంచే షూటింగ్ కూడా మొదలెట్టాలనుకున్నాడు. కానీ ఎట్ ఏ టైం రెండు మూడు పాన్ ఇండియా సినిమాలు చేసే అలవాటున్న ప్రభాస్.. తన అలవాటు కారణంగా ఎప్పటిలానే డేట్స్‌లో లేటైపోయాడు. దీంతో కాస్త సీరియస్ అయిన సందీప్ రెడ్డి వంగా.. నవ్వుతూనే ప్రభాస్‌కు ఓ కండీషన్ పెట్టాడట. ఇప్పటికే ప్రభాస్ చేస్తున్న రాజా సాబ్, ఫౌజీ సినిమా షూటింగ్‌లు కంప్లీట్ చేశాకే స్పిరిట్ సినిమా మొదలెట్టాలని.. ఆ సినిమా షూటింగ్ అయిపోయే వరకు మరే సినిమాకు కమిట్ అవ్వొద్దంటూ స్ట్రిక్ట్ గా చెప్పారట. మరి ఈ రూల్ పై మీరేమనుకుంటున్నారు?
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వారానికి రెండు రోజులు ఉపవాసం చేసి చూడండి.. మిమ్మల్ని మీరే నమ్మలేరు
IT రిటర్న్‌లు ఆలస్యమైతే రిఫండ్ రాదా ??
కీళ్లనొప్పులు వేధిస్తున్నాయా.. జుట్టు విపరీతంగా రాలిపోతుందా..!