TOP 9 ET News: యానిమల్‌ను మించేలా.. చరణ్‌తో సందీప్ రెడ్డి సినిమా

|

Mar 28, 2025 | 3:54 PM

నిప్పులేనిదే పొగ రాదంటారు. కానీ సినిమా తారలకు సంబందించి... సోషల్ మీడియాలో నిప్పు పప్పు లాంటి సామెతలేం అవసరం లేదు. ఫ్యాన్స్‌కు అనిపిస్తే చాలు కాంబోలు అల్లేస్తారు. అలా ఓ క్రేజీ కాంబో తమకు కావాలంటున్నారు. చిరు ఫ్యాన్స్‌.. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో చరణ్ ఓ సినిమా చేయాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.

అది కూడా యానిమల్ సినిమాను మించేలా ఉండాలని కోరుతూ పోస్టులు పెడుతున్నారు. మార్చ్‌ 27 చరణ్ బర్త్‌ డే సందర్భంగా.. ఆయన్ను విష్ చేస్తూ సందీప్ రెడ్డి వంగా ట్వీట్ చేశారు. నా స్నేహితుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు. పెద్ది పోస్టర్ అద్భుతంగా ఉందంటూ కూడా చెప్పాడు. అంతే చెర్రీ హార్ట్‌ కోర్ ఫ్యాన్స్‌ చరణ్ తో సినిమా చేయాలంటూ.. సందీప్ రెడ్డిని రిక్వెస్ట్ చేయడం షురూ చేశారు. రామ్‌చరణ్‌ పుట్టినరోజున ఫ్యాన్స్ కి బెస్ట్ గిఫ్ట్ అందింది. ఇన్నాళ్లూ ఆర్సీ 16 గా ప్రచారంలో ఉన్న సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఆ విషయాన్ని రివీల్‌ చేస్తూ పోస్టర్లను రిలీజ్‌ చేసింది యూనిట్‌. ఈ క్రమంలోనే చెర్రీ లుక్‌ పై చిరు రియాక్టయ్యారు. పెద్ది లుక్‌కు రివ్యూ ఇచ్చేశారు. పెద్ది లుక్‌ వెరీ ఇంటెన్స్, సినిమా లవర్స్ కి పెద్ది మూవీ ఫీస్ట్ లా ఉంటుందన్నారు తన ట్వీట్‌లో కోట్ చేశారు. అంతేకాదు నా ప్రియమైన రామ్ చరణ్‌కు హ్యాపీ బర్త్‌ డే అంటూ బర్త్‌ డే విషెస్ చెప్పారు మెగాస్టార్.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రేసు నుంచి సల్మాన్ ఔట్.. అల్లు అర్జున్‌తో అట్లీ మూవీ..?

Prabhas: ప్రభాస్ పెళ్లి అప్డేట్‌.. రియాక్ట్ అయిన రెబల్ స్టార్

Rashmika Mandanna: చేసింది తక్కువ సినిమాలే .. కానీ కోట్లు కూడబెట్టిన రష్మిక.. స్టార్ హీరోల వల్ల కూడా కాలేదుగా