TV9 Digital ET TOP9 News: పిల్లల్ని కనడం పై ఉపాసన రిప్లై | ఆలియాకు కవల పిల్లలు.. రివీల్ చేసిన భర్త..
బ్రహ్మాస్త్ర సినిమా నుంచి కేసరియా వీడియో సాంగ్ విడుదలైంది. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ కలిసి నటించిన సినిమా ఇది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు.
1 Brahmastra
బ్రహ్మాస్త్ర సినిమా నుంచి కేసరియా వీడియో సాంగ్ విడుదలైంది. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ కలిసి నటించిన సినిమా ఇది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను సౌత్‌లో రాజమౌళి సమర్పిస్తున్నారు. ఇక సెప్టెంబర్ 9న విడుదల కానుంది బ్రహ్మాస్త్ర.
2 Ramarao on duty (k2)
రామారావు ఆన్ డ్యూటీ ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చింది. అభిమానులకు కూడా నచ్చిందని ఆశిస్తున్నాను అని అన్నారు రవితేజ. దర్శకుడు శరత్‌మండవ చాలా మంచి సినిమా తీశారని, అందులో ఏమాత్రం డౌట్ లేదని అన్నారు రవితేజ. ఇక మూవీ ఈ నెల 29న రిలీజ్ కానుంది.
3 Thank you (k2)
తాతయ్య ఏఎన్నార్, నాన్న నాగార్జున స్ఫూర్తితో నటుడినయ్యా అని అన్నారు నాగచైతన్య. తనను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్న అభిమానులకు మంచి సినిమాలివ్వాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు కథలు ఎంపిక చేసుకుంటున్నానని చెప్పారు. ఆయన నటించిన థాంక్యూ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.
4 kgf2
యష్ హీరోగా నటించిన కేజీయప్2కు ఓర్‌మ్యాక్స్ పవర్ రేటింగ్స్ లో 90 ప్లస్ స్కోర్ దక్కింది. ఇంత స్కోర్ సాధించిన తొలి చిత్రంగా కేజీయఫ్2 వరల్డ్ రికార్డు సాధించింది. ఈ ఏడాది ఫస్టాఫ్‌లో రిలీజైన సినిమాల్లో 8.5 ఐఎండీబీ రేటింగ్‌తో టాప్‌లో ఉంది కేజీయఫ్2.
5 The Transporter
జేసన్ స్టాథమ్ హీరోగా నటించిన ది ట్రాన్స్‌పోర్టర్ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. టైగర్ జిందాహై, భారత్ సినిమాలను తెరకెక్కించిన అలీ అబ్బాస్ జాఫర్ ఈ సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
6 Selfie
మలయాళం బ్లాక్‌బస్టర్ డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా హిందీలో తెరకెక్కుతున్న సినిమా సెల్ఫీ. అక్షయ్‌కుమార్, ఇమ్రాన్ హష్మి కలిసి నటిస్తున్నారు. ఇద్దరు పవర్‌ఫుల్ వ్యక్తుల మధ్య వచ్చే ఈగో క్లాషెస్‌తో ఈ సినిమా రూపొందుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు మేకర్స్.
7 Varalakshmi
నటి వరలక్ష్మి శరత్‌కుమార్ కోవిడ్ బారిన పడ్డారు. కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్నానని, పాజిటివ్ వచ్చిందని ఆదివారం ఉదయం పోస్ట్ చేశారు వరలక్ష్మి. అందరూ మాస్కులు తప్పనిసరిగా వాడాలని అన్నారు. నటీనటులకు మాస్కులు ధరించే వెసులుబాటు ఉండదని, చుట్టూ ఉన్నవారు ధరించాలని చెప్పారు.
8 agent
అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ టీజర్ గురించి సూపర్‌స్టార్ మహేష్ ట్వీట్ చేశారు. టీజర్ ఆద్యంతం స్టన్నింగ్‌గా ఉందని అన్నారు మహేష్. అఖిల్‌ని మెచ్చుకున్నారు. విజువల్స్, సినిమా థీమ్ నచ్చాయని చెప్పారు. మమ్ముట్టికి, దర్శకుడు సురేందర్‌రెడ్డికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
9. Ranbir – alia
ఆలియా భట్ కవలలకు జన్మనివ్వనున్నట్టు రణ్‌బీర్ కపూర్ వెల్లడించారు. ఆయన నటించిన షంషేరా ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న రణ్‌బీర్ ఈ విషయాన్ని వెల్లడించారు.
10. జనాభా నియంత్రణ కోసమే.. పిల్లల్ని కనడంలేదని నెట్టింట వస్తున్న టాక్ కు చెక్ పెట్టారు ఉపాసన. సద్గురు జగ్గీతో తాను అలా అనలేదని.. కావాలంటే వీడియో చిరవరి వరకు చూడాలని నెటిజెన్స్ను కోరారు ఉపాసన.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..
Urfi Javed: ఇదేం ఫ్యాషన్‌రా బాబు.. ఒంటి నిండా బ్లేడ్‌లతో అరాచకం చేసేసిందిగా..