సామ్ రూట్లో సంయుక్త… ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, మాస్ కమర్షియల్ సినిమాల మధ్య చర్చ ఎప్పటికీ ఉంటుంది. ఈ మధ్య హీరోయిన్లు మాస్ సాంగ్స్ లో చూపిన కృషి ఈ టాపిక్ కు కొత్త కోణాన్ని ఇస్తోంది. సమంత 'ఊ అంటావా' పాటలో, సంయుక్త 'జజ్జికాయ' పాటలో తమను తాము నిరూపించుకున్నారు. సవాళ్లను స్వీకరించి, కఠినమైన రిహార్సల్స్ తో అద్భుతమైన అవుట్‌పుట్‌ను ఇవ్వడం ద్వారా, ఈ నటీమణులు మాస్ సాంగ్స్ కేవలం గ్లామర్ కోసమే కాదని నిరూపించారు.
పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మూవీస్ వర్సెస్ మాస్ కమర్షియల్ సినిమాలు టాపిక్ నెవర్ ఎండింగ్. ఎవర్ ట్రెండింగ్. ఈ టాపిక్‌లోనే కొత్త విషయాలకు తెర తీస్తున్నారు హీరోయిన్లు. అందులోనూ ఆ మధ్య సామ్ చెప్పిన ఓ విషయానికీ, ఇప్పుడు సంయుక్త చెప్పిన ఓ మాటకీ లింకు కుదిరింది. ఇంతకీ ఆ లంకేంటి? అంటారా? చూసేద్దాం వచ్చేయండి. ఊ అంటావా మావా అంటూ సామ్ స్టెప్పులేస్తే.. స్క్రీన్ మీద ఫైర్ పుట్టేసిందన్నారు జనాలు. థియేటర్లలో విజిల్స్ మోత మోగిపోయింది. పాట హిట్ కావడం వరకు ఓకే.. కానీ, దానికి వెనుక పడ్డ శ్రమ, చేసిన కృషి గురించి చాలానే చెప్పేశారు సామ్. నటిగా ప్రూవ్ చేసుకున్నాక, ఇంకేదైనా కొత్తగా చేయాలనుకున్నప్పుడు సామ్ తలుపు తట్టింది ఊ అంటావా సాంగ్. అప్పటిదాకా అంత హాట్‌గా కనిపించలేదు సామ్. అందుకే ఈ సాంగ్‌ని చాలెంజింగ్‌గా తీసుకుని డ్యాన్స్ చేశారు. ఇటీవల జాజికాయ పాటను కూడా సంయుక్త అంతే చాలెంజ్‌గా తీసుకుని చేశారు. మాస్ సాంగ్ చేయాలని బోయపాటి చెప్పినప్పుడు సింపుల్‌గా తల ఊపేశారట సంయుక్త మీనన్. కానీ 500 మంది డ్యాన్సర్ల మధ్య ఆ సాంగ్ షూట్‌కి వెళ్లినప్పుడు మాత్రం కాస్త టెన్షన్‌గానే అనిపించిందట. అప్పటికే రెండు రోజులు రిహార్సల్స్ చేసినా, తెలియని ఓ టెన్షన్ రన్ అయిందంటున్నారు సంయుక్త. కానీ, ఫైనల్ ఔట్‌పుట్ చూసుకున్నాక హ్యాపీగా అనిపించిందట. సో.. సాంగులందు మాస్ సాంగులు వేరయా అనే మాటను ఒప్పుకుని తీరాల్సిందేననే కంక్లూజన్‌కి వచ్చేస్తున్నారు నెటిజన్లు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్.. కెరీర్ బ్యాలన్స్ కోసం నానా కష్టాలు
Samantha: అత్తవారింట సమంతకు గ్రాండ్ వెల్‌కమ్
Bigg Boss Telugu: బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
Ritu Choudhary: భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
TOP 9 ET News: రాజ్ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్