Kalki 2898 AD: రెస్పాన్స్ అదిరిపోయింది.. కానీ వ్యూస్ మాత్రం తక్కువే..

Kalki 2898 AD: రెస్పాన్స్ అదిరిపోయింది.. కానీ వ్యూస్ మాత్రం తక్కువే..

Rajeev Rayala

|

Updated on: Jul 23, 2023 | 10:01 PM

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న నయా మూవీ ప్రాజెక్ట్ కే.. తాజాగా కే అంటే ఏంటో చెప్పేశారు మేకర్స్. ఇందుకోసం ఓ బడా ఈవెంట్ ను ఏర్పాటు చేసి ప్రాజెక్ట్ కే అంటే ఏంటో ఓ వీడియోతో చెప్పేశారు. కల్కి 2898 ad అనే టైటిల్ తో తెరకెక్కుతోంది ఈ సినిమా.



రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న నయా మూవీ ప్రాజెక్ట్ కే.. తాజాగా కే అంటే ఏంటో చెప్పేశారు మేకర్స్. ఇందుకోసం ఓ బడా ఈవెంట్ ను ఏర్పాటు చేసి ప్రాజెక్ట్ కే అంటే ఏంటో ఓ వీడియోతో చెప్పేశారు. కల్కి 2898 ad అనే టైటిల్ తో తెరకెక్కుతోంది ఈ సినిమా. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్నారు. ప్రభాస్ కు జోడీగా దీపికా పదుకొనె నటిస్తుండగా.. కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్ , అలాగే యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమానుంచి ఓ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ వీడియో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. వరుసగా ఫ్లాప్ లతో సతమతం అవుతున్న డార్లింగ్ కు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది గ్లింప్స్ చూస్తుంటే. అయితే ఈ వీడియోకి రెస్పాన్స్ మాత్రం బాగానే వచ్చిన వ్యూస్ మాత్రం అంతగా రాలేదు అందుకు కారణం ఏమై ఉంటుందబ్బా..!