The Raja Saab Collection: టాక్ సంగతి పక్కకు పెడితే… రాజాసాబ్‌కు డే1 దిమ్మతిరిగే కలెక్షన్స్
ప్రీమియర్ షో వివాదాలు, టికెట్ రేట్ల పెంపు జీవో సస్పెండ్ అయినా, మిక్స్‌డ్ టాక్ వచ్చినా ప్రభాస్ 'రాజాసాబ్' బాక్సాఫీస్ వద్ద తన స్టామినా చూపించాడు. జనవరి 9న విడుదలైన ఈ చిత్రం డే 1న ఏకంగా 112 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. అన్ని అంచనాలు, అడ్డంకులను అధిగమించి, ప్రభాస్ 'రాజాసాబ్' కలెక్షన్ల సునామీతో దూసుకుపోతున్నాడు.
ప్రీమియర్ షోస్ వివాదం.. తెలంగాణలో టికెట్ రేట్స్ పెరగడంలో జాప్యం.. ఆతర్వాత కోర్టు నుంచి టికెట్ హైక్స్ జీవో సస్పెండ్ అవడం… ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన రాజాసాబ్‌కు మిక్స్‌డ్ టాక్ రావడం.. వీటన్నింటి మధ్యలో రాజాసాబ్ మరో సారి తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపించాడు. డే1 దిమ్మతిరిగే కలెక్షన్స్‌నే పట్టేశాడు. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. మారుతీ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా రాజాసాబ్. చాలా కాలం తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సరికొత్త జానర్ సినిమా కావడంతో.. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం వెయిట్ చేశారు. ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈక్రమంలోనే జనవరి 9 రిలీజ్ అయిన రాజాసాబ్ మిక్స్‌డ్ టాక్ ను సొంతం చేసుకున్నప్పటికి.. నయా రికార్డులను క్రియేట్ చేసింది. డే1 కలెక్షన్స్ సునామీ సృష్టించింది.అకార్డింగ్ అఫీషియల్ రిపోర్ట్స్.. ది రాజా సాబ్ మూవీ.. తొలి రోజు బాక్సాఫీస్ వద్ద 112 క్రోర్ గ్రాస్‌ను వసూల్లు చేసింది. దీంతో రాజాసాబ్ టాలీవుడ్ లోనే కాదు.. ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలో మరో సారి హాట్ టాపిక్ అవుతున్నాడు. బాక్సాఫీస్ రారాజు.. మన ప్రభాసు అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
The Raja Saab: ధురంధర్ రికార్డ్ బద్దలుకొట్టిన రాజాసాబ్
RGV: చిన్న పిల్లలు కూడా ఏదైనా చూడగలుగుతున్నారు కదా.. సెన్సార్ బోర్డ్ పై RGV బిగ్ పంచ్
చిరు సినిమాకు రివ్యూ, రేటింగ్ ఇవ్వకూడదు.. కోర్టు సంచన తీర్పు
