మెగాస్టార్‌ను కలిసేందుకు కర్నూలు మహిళ సైకిల్ యాత్ర ఏకంగా 218కి.మీ తొక్కుతూనే..

Updated on: Aug 20, 2025 | 3:57 PM

సినీ హీరోలకు కోట్లలో అభిమానులుంటారు. కొందరు తమ అభిమాన హీరో కోసం ఎంతటి సాహసానికైనా వెనుకాడరు. ఆ కోవకు చెందినవారే కర్నూలు జిల్లాకు చెందిన రాజేశ్వరి. ఈమెకు మెగా ఫ్యామిలీ అంటే ఎనలేని అభిమానం. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికల్లో గెలవాలని ఆంజనేయస్వామికి మొక్కుకుని మోకాళ్లపైన 300 గుడి మెట్లు ఎక్కి మొక్కుచెల్లించుకున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ను కలిసేందుకు ఆదోని నుంచి అమరావతికి సైకిల్‌ యాత్ర చేసి మరీ.. పవన్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు దగ్గరపడుతుండటంతో ఆయనను స్వయంగా కలిసి శుభాకాంక్షలు చెప్పాలని కర్నూలు నుంచి హైదరాబాద్‌కు సైకిల్‌ యాత్ర చేపట్టారు రాజేశ్వరి. ఈ క్రమంలో పలువురు మెగా అభిమానులు రాజేశ్వరికి సంఘీభావం తెలుపుతూ సైకిల్‌ యాత్రలో పాల్గొన్నారు. మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజున ఆయనను కలవాలని, స్వయంగా శుభాకాంక్షలు చెప్పాలని తన కోరిక అని, అందుకే సైకిల్‌ యాత్ర చేపట్టానని రాజేశ్వరి తెలిపారు. మెగా కుటుంబం కోసం ఎంతటి సాహసమైనా చేస్తానని స్పష్టం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Tamannaah Bhatia: తమన్నాకు అవమానం జాన్వీ ఫ్యాన్స్‌ ఓవర్ యాక్షన్

విమానం వస్తే.. రైలు ఆగిపోవల్సిందే.. ఎక్కడో తెలుసా?

కడుపునొప్పితో ఆస్పత్రికి పదేళ్ల బాలిక.. సర్జరీ చేసి చూస్తే షాక్‌

అమ్మబాబోయ్‌.. చెట్టుకి దెయ్యం పట్టిందా.. ఏం జరిగిందో చూస్తే..!

బాబోయ్‌ ఇదేం వింత ఆచారం! తలపై కొబ్బరి కాయ పగలగొట్టి