గేరు మార్చిన టాప్‌ కెప్టెన్స్‌.. చిత్రాలను వేగంగా పూర్తి చేస్తున్న దర్శకులు

Updated on: Oct 11, 2025 | 11:59 AM

తెలుగు దర్శకులు స్టార్ హీరోల చిత్రాల నిర్మాణంలో కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. అనిల్ రావిపూడి చిరంజీవి, ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్, కిషోర్ తిరుమల రవితేజ చిత్రాలను జెట్ స్పీడ్‌తో పూర్తి చేస్తున్నారు. గతంలో ఏళ్లు పట్టే సినిమా ప్రాజెక్టులను తక్కువ సమయంలోనే పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇది పరిశ్రమలో సరికొత్త రికార్డులకు దారితీస్తోంది.

స్టార్ హీరోల చిత్ర నిర్మాణానికి సంవత్సరాలు పడుతుందనే సంప్రదాయాన్ని నేటి దర్శకులు బ్రేక్ చేస్తున్నారు. ఒకే సినిమాపై దీర్ఘకాలం వర్క్ చేయకుండా, వీలైనంత త్వరగా ప్రాజెక్టులను పూర్తి చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ జాబితాలో పలు ఆసక్తికర ప్రాజెక్టులు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను జెట్ స్పీడ్‌తో ఫినిష్ చేస్తున్నారు. షూటింగ్ ప్రారంభానికి ముందే రిలీజ్ డేట్‌ను లాక్ చేసి, తన మేకింగ్ స్టైల్‌పై అనిల్ రావిపూడి తనకున్న నమ్మకాన్ని ప్రూవ్ చేశారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మేజర్ పార్ట్ పూర్తి అయింది. మరో నెల రోజుల్లో షూటింగ్ అంతా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభించేలా షెడ్యూల్స్ ప్లాన్ చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రీ రిలీజ్‌ సినిమాలకు మళ్లీ క్రేజ్‌.. రెడీ అయిన వరుస సినిమాలు

హీరోయిన్ల విషయంలో ఎందుకు వివక్ష అంటున్న దీపికా పదుకొనే

హిట్‌ పెయిర్స్‌కు పెరుగుతున్న క్రేజ్

తమిళనాడులో మన సినిమాలకు స్క్రీన్స్ లేవన్న కిరణ్ అబ్బవరం

నవంబర్‌లో థియేటర్లలో సందడి చేసే మూవీస్ ఇవే