పైరసీకి ఫుల్‌స్టాప్‌ పెట్టాలంటే.. ఆ పని చేయాల్సిందే..

Edited By:

Updated on: Nov 20, 2025 | 3:54 PM

తెలుగు సినిమా పరిశ్రమలో పెద్ద సినిమాల ప్రభావంతో చిన్న చిత్రాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. అధిక రెమ్యునరేషన్లతో బడ్జెట్లు పెరిగి, టిక్కెట్ ధరలు సామాన్యుడికి భారం అవుతున్నాయి, ఇది పైరసీకి దారితీస్తోంది. పైరసీని అరికట్టడానికి, టిక్కెట్ ధరలపై చర్చకు ఫిల్మ్ ఛాంబర్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని, ఈ సమస్యల త్వరిత పరిష్కారం పరిశ్రమకు అత్యవసరం.

ఏడాది మొత్తం మీద విడుదలయ్యే పది పెద్ద సినిమాల కోసం మిగిలిన చిన్న సినిమాలన్నీ బలైపోవాలా? సినిమాకు ఇద్దరికి ఇచ్చే రెమ్యునరేషన్స్ కోసం బడ్జెట్‌ అమాంతం పెరగాలా? ఆ భారం సామాన్యుడి మీద ఎందుకు పడాలి?.. అచ్చం ఇలాంటి ప్రశ్నలే వినిపిస్తున్నాయి చాంబర్‌ పెద్దల నుంచి. వీడియో పైరసీ, సెల్‌ పైరసీ నుంచి సినిమాను రక్షించడానికి చాంబర్‌ ఎంతో కృషి చేస్తోంది. వందల మంది కష్టానికి రూపం సినిమా. పైరసీ చేసే వారిని ఎన్‌కౌంటర్‌ చేయాల్సిందేనన్నది సి.కల్యాణ్‌ మాట. ఇప్పటి వరకు చేస్తున్నదంతా సరే, క్యూబ్‌, యుఎఫ్‌ఓ వంటి ప్లాట్‌ పార్మ్స్ ద్వారా లీక్‌ అవుతుందన్న విషయం మీద దృష్టి పెట్టాలన్నది కూడా స్టేజ్‌ మీద వినిపించిన సలహా. ఎక్కువ బడ్జెట్‌ పెట్టి సినిమాలు చేశామంటే కుదరదు… వాటి భారం టిక్కెట్ల మీద పడుతుంది. సామాన్యుడు అంతంత కట్టుకోలేక దొంగ దారిలో సినిమా చూస్తున్నాడు. పదిలోపు వచ్చే పెద్ద బడ్జెట్‌ సినిమాల కోసం చిన్న సినిమాలన్నీ చితికి పోతున్నాయన్నది మరికొందరి ఆవేదన. పైరసీని అరికట్టడానికి ప్రభుత్వంతో కలిసి ఫిల్మ్ చాంబర్‌ అడుగులు వేయాలి. టిక్కెట్‌ రేట్ల విషయంలోనూ చాంబర్‌లో చర్చ జరగాలి. అతి త్వరలోనే ఆ ప్రయత్నం చేస్తామన్నది పెద్దల మాట. ఎంత త్వరగా జరిగితే అంత మేలన్నది అన్ని వైపుల నుంచి వినిపిస్తున్న సలహా.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అల్లు అర్జున్‌తో పోటీ.. పృథ్విరాజ్‌ సుకుమారన్‌ ఏమన్నారు ??

Rajamouli: ఇంటర్నేషనల్‌ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన జక్కన్న.. మరీ ఇంత అడ్వాన్స్ గానా

సిల్వర్ స్క్రీన్ మీద రిపీట్‌ అవుతున్న జోడీలు.. మళ్లీ కుదురుతున్నట్టేనా ??

Nayanthara: సింహా జోడీకి సూపర్‌క్రేజ్‌.. మహారాణి వచ్చేస్తున్నారహో

పాన్ ఇండియా డైరెక్టర్లు.. పక్కా లోకల్‌ సినిమాలు చేసేదెప్పుడు