డిజిట్స్ ని డిసైడ్ చేస్తున్న డిజిటిల్ మార్కెట్
అర చేతిలో సినిమా... అంత పెద్ద తెరను శాసిస్తోందా? డిజిటల్ మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకుని మేకర్స్ డిజిట్స్ మారుస్తున్నారా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రమే కాదు... క్వాలిటీని కూడా వాళ్లే డిసైడ్ చేస్తున్నారా ? ఇంతకీ ఓటీటీ రెవల్యూషన్ ఎలా ఉంది? సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి మార్పుల్ని క్రియేట్ చేస్తోంది?
వీరసింహారెడ్డి సినిమా చేసిన కాంబినేషన్ మళ్లీ సెట్స్ మీదకు వెళ్తోందంటే ట్రేడ్ వర్గాల్లో అదో రకమైన ఆనందం. అంత క్రేజ్ ఉన్నా సరే.. ఓటీటీని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా బడ్జెట్ ని కుదించారన్నది ఇప్పుడు నిర్మాతలు డిస్కస్ చేసుకుంటున్న టాపిక్. ఈ పరిస్థితి బాలయ్య సినిమాకేనా? బాలయ్య మూవీకే కాదు… ఇప్పుడు సెట్స్ మీదున్న చాలా సినిమాలనూ ఓటీటీ వణికిస్తోంది. వాళ్లు చెప్పిన టైమ్‌కి రిలీజ్ చేస్తేనే ఫుల్ పేమెంట్. రెండు సార్లు వాయిదా వేస్తే టెన్ పర్సెంట్ కట్… అంతకు మించి వాయిదా పడితే.. మళ్లీ లెక్కలు మారుతున్నాయి. ఒన్లీ రిలీజ్ డేట్ల పరంగానే కాదు.. క్వాలిటీ విషయంలోనూ ఇదే పరిస్థితి. సినిమా చూసుకున్నాక అనుకున్నంత బాగా లేకపోతే.. అసలు కొనే వాళ్లే కరవైపోతున్నారు. చెప్పింది చెప్పినట్టు కొనాలన్నా, డీల్ క్లోజ్ చేయాలన్నా ఓటీటీ సంస్థలు శాటిస్‌ఫై కావాల్సిందే. అందుకే భారీ సినిమాలను మరింత గ్రాండియర్‌గా తీయడానికి వెనకాడటం లేదు. క్వాలిటీ విషయంలో రాజీ పడటం లేదు. సెట్స్ మీద వృథా ఖర్చు కాకుండా రేపటి గురించి ఆలోచించి ఆచితూచీ వ్యవహరిస్తున్నారు. పేపర్ మీద బడ్జెట్ కంట్రోల్ అనేది సినిమా ఇండస్ట్రీకి చాలా శ్రేయస్కరం అంటున్నారు అనుభవజ్ఞులు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కింగ్ కోబ్రా తిరగబడితే ఎలా ఉంటుందో తెలుసా.. చూస్తే గుండె గల్లంతే
పశువులకోసం గడ్డి కోస్తున్న యువతి.. ఊహించని విధంగా
పంటపొలాల్లో చేపల సందడి.. సంచులతో ఎగబడ్డ జనం
