Hanuman: హనుమాన్‌ టీంకు గొప్ప గౌరవం.! నేరుగా గవర్నర్‌ చేతుల మీదగానే..

|

Jan 27, 2024 | 1:46 PM

ఇప్పుడు దేశవ్యాప్తంగా ‘హనుమాన్’ సినిమా పేరు మారుమోగుతోంది. ఎలాంటి అంచనాలు లేకుండానే సంక్రాంతి పండక్కి అడియన్స్ ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పటివరకు ఈ సినిమా దాదాపు 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తుంది. దేశవ్యాప్తంగా సినీ క్రిటిక్స్, సెలబ్రెటీస్, రాజకీయ నాయకులు ఈ మూవీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం… వీఎఫ్ఎక్స్ విజువల్స్.. యంగ్ హీరో తేజా సజ్జా నటనకు అంతా ఫిదా అయ్యారు.

ఇప్పుడు దేశవ్యాప్తంగా ‘హనుమాన్’ సినిమా పేరు మారుమోగుతోంది. ఎలాంటి అంచనాలు లేకుండానే సంక్రాంతి పండక్కి అడియన్స్ ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పటివరకు ఈ సినిమా దాదాపు 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తుంది. దేశవ్యాప్తంగా సినీ క్రిటిక్స్, సెలబ్రెటీస్, రాజకీయ నాయకులు ఈ మూవీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం… వీఎఫ్ఎక్స్ విజువల్స్.. యంగ్ హీరో తేజా సజ్జా నటనకు అంతా ఫిదా అయ్యారు. ఇక ఈక్రమంలోనే తాజాగా హనుమాన్ టీం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‏ను కలిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు గవర్నర్ తమిళి సై.

హనుమాన్ చిత్రయూనిట్.. హీరో తేజా సజ్జా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ను కలిశారు. కాసేపు గవర్నర్ తో ముచ్చటించారు. అనంతరం గవర్నర్ తమిళిసై సినిమా మంచి విజయాన్ని సాధించినందుకు అభినందనలు తెలియజేశారు. అలాగే హనుమాన్ చిత్రబృందాన్ని సత్కరించారు. అంతేకాదు హనుమాన్ టీంను సత్కరించిన ఫోటోలను గవర్నర్ తన ట్విట్టర్లో షేర్ చేశారు. దేశవ్యాప్తంగా అద్భుతమైన విజయం సాధించినందుకు హనుమాన్ టీంకు అభినందనలని తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ బాగుందని.. తేజ సజ్జా ఎంతో కాన్ఫిడెన్స్ తో.. నైపుణ్యంతో నటించారని కూడా.. తన ట్వీట్లో కోట్ చేశారు గవర్నర్ తమిళి సై.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos