Teja Sajja: నేను విన్నాను.. నేనున్నాను అంటున్న హీరో

Edited By:

Updated on: Jan 02, 2026 | 3:40 PM

తేజ సజ్జా 'జై హనుమాన్' నుండి తప్పుకున్నారనే రూమర్స్ అవాస్తవం. 'హనుమాన్' విజయంతో స్టార్‌డమ్ పొందిన తేజ, ప్రశాంత్ వర్మ చిత్రాలతో పాటు పలు ప్రాజెక్ట్‌లలో బిజీగా ఉన్నారు. తన పాత్ర పరిధి తగ్గిందన్న వార్తల్లో నిజం లేదని ఆయన టీమ్ స్పష్టం చేసింది. తేజ ఫ్రాంచైజీలో కొనసాగుతూ, 'మిరాయ్ జైత్రయ', 'జాంబి రెడ్డి 2' వంటి చిత్రాలలో నటిస్తున్నారు.

జై హనుమాన్ నుంచి తేజ సజ్జా తప్పుకున్నారా..? తనకు లైఫ్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ సినిమా నుంచి తేజ తప్పుకున్నారంటే నమ్మొచ్చా..? అసలు అలాంటి రూమర్స్ ఎందుకొచ్చాయి.?? నిజంగా తేజ హనుమాన్ ఫ్రాంచైజీని వదిలేస్తున్నారా..? ప్రస్తుతం ఈ హీరో ఎన్ని సినిమాలు చేస్తున్నారు..? జై హనుమాన్ ముచ్చట్లేంటి..? తేజ సజ్జ కెరీర్‌ను హనుమాన్‌కు ముందు.. తర్వాత అని డిసైడ్ చేయాలి. అప్పటి వరకు హీరోగా స్ట్రగుల్ అవుతున్న తేజకు హనుమాన్ కావాల్సినంత సపోర్ట్ ఇచ్చింది. ఈ చిత్రం ఏకంగా 300 కోట్ల వరకు వసూలు చేసి.. మనోడిని సూపర్ హీరోగా మార్చేసింది.. ఆ తర్వాత గతేడాది వచ్చిన మిరాయ్‌తో స్టార్ అయిపోయారు తేజ సజ్జా. హనుమాన్, మిరాయ్‌తో మార్కెట్ క్రియేట్ చేసుకున్న తేజ.. ప్రస్తుతం వరస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. అందులో జై హనుమాన్‌తో పాటు మిరాయ్ జైత్రయ, జాంబి రెడ్డి 2 ఉన్నాయి. అయితే జై హనుమాన్‌లో తన పాత్రకి స్కోప్ తగ్గిందని హర్ట్ అయి.. తేజ తప్పుకున్నారనే వార్తలు వచ్చాయి. అందులో నిజం లేదని.. హనుమాన్ ఫ్రాంచైజీలో తేజ ఉన్నారని ఆయన టీం తెలిపింది. జై హనుమాన్‌లో రిషబ్ శెట్టి ఆంజనేయుడిగా నటిస్తున్నారు. దాంతో పాటు ప్రశాంత్ వర్మతో జాంబి రెడ్డి 2 కూడా ఉంది. అలాగే మిరాయ్ పార్ట్ 2 జైత్రయ త్వరలోనే మొదలు కానుంది. ప్రస్తుతానికి ఈ మూడు సినిమాల్లోనూ తేజ ఉన్నారు. వీటితో పాటు కొత్త ప్రాజెక్ట్స్ ఓకే అయితే నేనే చెప్తానంటున్నారు ఈ కుర్ర హీరో.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Nayanthara: నయనతారకు మాత్రమే అదెలా సాధ్యం..?

కమ్ బ్యాక్ ఇవ్వాలమ్మా.. లేకపోతే చాలా కష్టం

2026లో దండయాత్రే.. కళ్ల ముందు 5 వేల కోట్లు

బాస్‌ – వెంకీల ధాటికి దద్దరిల్లిపోతున్న యూట్యూబ్‌

అప్పుడు దేఖలేదు.. ఇప్పుడు.. ఈ సినిమా గురించే అందరి నోటా మాట