ఛీ ఛీ.. కోట్లు ఇచ్చినా బిగ్ బాస్‌కు వెళ్లను.. ఆ పని చేయను!
తను శ్రీ దత్తా! వీరభద్ర సినిమాతో నందమూరి బాలకృష్ణ పక్కన బంపర్ ఛాన్స్ కొట్టేసి.. టాలీవుడ్ లో ల్యాండ్ అయిన ఈ బ్యూటీ... ఆ సినిమా రిజెల్ట్ కారణంగా.. టాలీవుడ్‌లో రాణించలేకపోయింది. బాలీవుడ్ కొన్నాళ్లు స్టార్ హీరోయిన్‌గా... కుర్రాళ్ల ఆరాధ్య దేవతగా కొనసాగినప్పటికీ... ఆ తర్వాత సినిమాలకు దూరమై పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది.
అయితే.. తన ఇంట్లో వాళ్లే తనను వేధిస్తున్నారని, ఆ టార్చర్ తట్టుకోలేకపోతున్నానని.. ఎవరైనా సాయం చేయాలంటూ ఈ నటి గతంలో ఓ వీడియోను షేర్ చేసింది. దీంతో ఆ వీడియో నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఇప్పుడు ఉన్నట్టుండి.. బిగ్‌బాస్ షోపై సంచలన కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ. ఈ కామెంట్స్‌తోనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తనకు గత 11 ఏళ్లుగా బిగ్‌బాస్ ఆఫర్ వస్తుందని.. రూ.1.65 కోట్లు ఆఫర్ చేసినా ఆ షోకు వెళ్లడం లేదంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. నిర్మాతలు.. ఆకాశంలోని చంద్రుడిని తీసుకొచ్చి తన చేతిలో పెట్టినా.. తాను మాత్రం ఆ బిగ్ బాస్ షోకు వెళ్లనని స్టేట్మెంట్ ఇచ్చింది. ‘బిగ్‌బాస్ షోలో మహిళలు, పురుషులు ఒకే బెడ్ పై పడుకుంటారు.. అదే ప్లేస్ లో కొట్లాడుకుంటారు. రియాల్టీ షో కోసమైనా సరే.. ఆ షోకి వెళ్లే వారు మరో వ్యక్తితో ఒకే మంచంపై ఎలా పడుకుంటారో? నేను మాత్రం అంత చీప్ కాదు.. ఎన్ని కోట్లు ఇచ్చినా బిగ్‌బాస్‌కు వెళ్లను.. నా కుటుంబంతోనే కలిసి ఉంటా’ అని చెప్పుకొచ్చింది తను శ్రీ.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Katrina Kai: తల్లి కాబోతున్న కత్రినా ?? గాలి వార్త కాదు కదా..!
బేరం కుదరకే.. బిగ్ బాస్‌పై చాడీలు.. ఒకప్పటి హీరోయిన్ ఓవర్ యాక్షన్
