Bichagadu-2 Review: బిచ్చగాడు-2 హిట్టా..? ఫట్టా..? బిచ్చగాడు మ్యాజిక్ ను రిపీట్ అయ్యిందా.. లేదా..?
బిచ్చగాడు సూపర్ డూపర్ హిట్‌తో.. తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఆంటోని.. తాజాగా బిచ్చగాడు 2తో మన ముందుకు వచ్చారు. మరి ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈయన అందరి అంచనాలను అందుకున్నారా? బిచ్చగాడు రేంజ్ సక్సెస్ కొడతారా? అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తారా? తెలియాలంటే.. ఈ రివ్యూ చూడాల్సిందే!
ఇక కథ విషయానికి వస్తే.. విజయ్ గురుమూర్తి అలియాస్ విజయ్ ఆంటోని లక్ష కోట్లకు వారసుడు. తండ్రి చనిపోయాడన్న బాధకన్నా, నాన్న మరణవార్తతో షేర్ వేల్యూస్ పడిపోకూడదనుకునే పక్కా బిజినెస్‌మేన్. కానీ తన స్నేహితుడు అరవింద్ చెప్పినట్టే చేస్తుంటాడు. ఇక ఈ క్రమంలోనే తన ఫ్యామిలీ డాక్టర్, ఫ్రెండ్ , ఇంకో వ్యక్తి కలిసి విజయ్ గురుమూర్తి కి బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తారు. బిచ్చగాడు అనాథ అయిన సత్య అలియాస్ మరో విజయ్ అంటోని బ్రెయిన్‌ను.. ఈ బిజినెస్ మ్యాన్‌కు అమరుస్తారు. కానీ బిచ్చగాడైన సత్య నేర చరిత్ర .. ఉన్నవాడు. బ్రెయిన్ ట్రాన్స్‌పర్ తర్వాత కోపంతో విజయ్ గురుమూర్తి ఫ్రెండ్ అరవింద్‌ను కూడా చంపేస్తాడు. యాంటీ బిగిల్ అని ఓ మిషన్ను స్టార్ట్ చేస్తాడు. కానీ చిన్న తప్పు వల్ల పోలీసులకు దొరికిపోతాడు. దీంతో విషయం స్టేట్ సీఎందాకా వెళ్తుంది. విజయ్ రూపంలో ఉన్న సత్యకు ఆస్తి దక్కకూడదని సీఎం స్కెచ్ వేస్తాడు. గురుమూర్తి అన్న కొడుకుని రంగంలోకి దింపుతాడు. చివరకు ఏమైంది? యాంటి బిగిల్ మిషన్ లక్ష్యం ఏంటి? దాన్ని ఎవరు లీడ్ చేశారు? సత్య వెతుకుతున్న రాణి ఎవరు? విజయ్ ప్రేయసి హేమ, రాణిని దగ్గర తీసిందా? లేదా? అన్నదే మిగిలిన కథ.విజయ్ గురుమూర్తి, సత్య కేరక్టర్లలో చాలా మంచి వేరియేషన్ చూపించారు విజయ్ ఆంటోనీ. మేకప్ కూడా రెండు కేరక్టర్లకూ డిఫరెంట్‌గా ఉంది. జైల్లో పెరిగిన వ్యక్తికి, రిచ్ పర్సన్‌కి ఉన్న బాడీ లాంగ్వేజ్ కూడా పర్ఫెక్ట్ గా పోట్రే చేశారు విజయ్ ఆంటోనీ. డైరక్టర్‌గానూ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బావుంది. చెల్లి కోసం సాగే పాట తప్ప, మిగిలినవి పెద్ద ఇంట్రస్టింగ్‌గా లేవు. కావ్య ఫస్ట్ పాటలో గ్లామరస్‌గానూ, తర్వాత సన్నివేశాల్లో డీసెంట్‌గానూ మెప్పించారు. తక్కువ కేరక్టర్లతో రాసుకున్న కథ ఇది. కాకపోతే ఇంకాస్త గ్రిప్పింగ్‌గా రాకసుకుంటే బాగుండనే ఫీలింగ్ చూసిన వెంటనే కలుగుతుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
krithi shetty: అందం కోసం కృతి ప్లాస్టిక్ సర్జరీ..? క్లియర్ కట్ గా దిమ్మతిరిగే క్లారిటీ..