బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో తారే జమీన్ పర్ ఒకటి. పిల్లల పెంపకం, చదువు, తల్లిదండ్రుల పాత్ర వంటి అంశాలను ఎంతో హృద్యంగా చూపించారీ సినిమాలో. ఆమీర్ ఖాన్ ఇందులో నటించడంతో పాటు దర్శకత్వ, నిర్మాణ బాధ్యతలను కూడా భుజానకెత్తుకున్నాడు. ఇక ఈ సినిమాలో ఆమిర్ తో పోటీ పడి నటించాదు దర్శిల్ సఫారీ. . ఈ సినిమాలో నటించేటప్పటికి అతనికి పదేళ్లు కూడా నిండలేదు. కానీ తన అమాయక నటనతో అందరి కళ్లల్లో నీళ్లు తెప్పించాడు దర్శిల్.
డైస్లెక్సియాతో బాధపడుతున్న ఓ పిల్లాడి పాత్రలో దర్శిల్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా తర్వాత 2010లో బం బం బోలే అనే చిత్రం, అలాగే 2011లో డిస్నీ జోకోమోన్ చిత్రంలో సూపర్ హీరో పాత్రను పోషించాడు. ఇలా పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించాడు. అలాగే ‘ఝలక్ దిఖ్లాజా’ వంటి డ్యాన్స్ రియాలిటీ షోల్లో సందడి చేశాడు. అలాగే పలు షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియోల్లో సందడి చేశాడు. వీటితో పాటు మిడ్ నైట్ చిల్ర్డన్ అనే మరో సినిమాలో కూడా దర్శిల్ సఫారీ నటించి మెప్పించాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.