Taapsee Pannu: బాలీవుడ్ మీద ఫైర్ అవుతున్న తాప్సీ..
తాప్సీ పన్ను బాలీవుడ్ పీఆర్ వ్యూహాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు తమ సినిమాల హైప్ కన్నా ఇతరుల సినిమాలను దెబ్బతీయడంపై దృష్టి పెడుతున్నారని ఆమె విమర్శించారు. ఇండస్ట్రీలో నెగెటివిటీ పెరిగిపోయిందని, తాను మాత్రం ఇలాంటి నిందారోపణ ఆటలో భాగం కానని తాప్సీ స్పష్టం చేశారు.
తాప్సీ పన్ను బాలీవుడ్‌లో పీఆర్ వ్యూహాలపై సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. సినిమా అప్‌డేట్స్ తోనో, వివాదాలతోనో ఎప్పుడూ వార్తల్లో ఉండే తాప్సీ ఇటీవల పెద్దగా కనిపించకపోయినా, ఆమె తాజా కామెంట్స్‌తో అభిమానుల దృష్టిని ఆకర్షించారు. నటిగా, నిర్మాతగా బాలీవుడ్‌లో బిజీగా ఉన్న ఆమె, అక్కడి పీఆర్ స్ట్రాటజీల తీరుపై విరుచుకుపడ్డారు. ఇండస్ట్రీలో నెగెటివిటీ విపరీతంగా పెరిగిపోయిందని తాప్సీ ఆవేదన వ్యక్తం చేశారు. తమ సినిమాను విజయవంతం చేయడం కన్నా, ఇతర సినిమాలను దెబ్బతీయడంపైనే కొందరు ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారని ఆమె విమర్శించారు. కొన్ని పీఆర్ టీమ్‌లు తమ చిత్రాలకు హైప్ క్రియేట్ చేయకుండా, ఇతర సినిమాలపై నెగెటివ్ రివ్యూలను ప్రమోట్ చేస్తున్నాయని తాప్సీ పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kethika Sharma: సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న బ్యూటీ.. హిట్ కోసం వెయిటింగ్
Vijay Sethupathi: జైలర్ 2 సెట్‌లో విజయ్ సేతుపతి.. బాలయ్య గెస్ట్ రోల్ లేనట్టేనా ?
