Sushant Singh Rajput: అప్పుడు చనిపోయి.. ఇప్పుడు గెలిచాడు..! నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న హీరో.. (వీడియో)

|

Nov 01, 2021 | 9:44 AM

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఈ లోకాన్ని విడిచి పెట్టి ఉండొచ్చు.. కాని చాలా మంది గుండెల్లో.. మాత్రం ఇంకా జీవించే ఉన్నాడు. వారి జ్ఙాపకాల్లో ఇంకా విహరిస్తూనే ఉన్నాడు. చెరగని చిరునవ్వు.. చెదిరిపోని విశ్వాసానికి బ్రాండ్ అంబాసిడర్‌లా ఉండే సుశాంత్ కష్టపడి

YouTube video player
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఈ లోకాన్ని విడిచి పెట్టి ఉండొచ్చు.. కాని చాలా మంది గుండెల్లో.. మాత్రం ఇంకా జీవించే ఉన్నాడు. వారి జ్ఙాపకాల్లో ఇంకా విహరిస్తూనే ఉన్నాడు. చెరగని చిరునవ్వు.. చెదిరిపోని విశ్వాసానికి బ్రాండ్ అంబాసిడర్‌లా ఉండే సుశాంత్ కష్టపడి మరీ హీరోగా తనను తాను ఫ్రూఫ్‌ చేసుకున్నాడు. మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. అందుకే కాబోలు మరణించాక కూడా తన సినిమాతో నేషనల్ అవార్డు గెలుచుకున్నాడు.

అవును సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ హీరోగా నటించిన ‘చిచోరే’ సినిమా నేషనల్ అవార్డు పొందింది. అయితే ఈ అవార్డును అందుకున్న ఈ సినిమా నిర్మాత సాజిద్ నడియావాలా.. డైరెక్టర్ నితీష్ తివారీ.. హీరో సుశాంత్ ను మరో సారి తలుచుకున్నారు. అతడితో గడిపిన క్షణాలను గుర్తుకు తెచ్చుకున్నారు. అంతే కాదు ఈ అవార్డును సుశాంత్‌కు అంకితం ఇచ్చారు.అయితే సుశాంత్‌కు నేషనల్ అవార్డును అంకితం ఇవ్వడంపై చిచోరే మూవీ టీంను అభినందించారు సుశాంత్ సిస్టర్ శ్వేత. ఈ మేరకు సోషల్ మీడియా వేదికలో సుశాంత్ మూవీ టీం తో ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేశారు. ఇప్పుడీ ఫోటో అందర్నీ ఆకట్టుకుంటూ నెట్టింట వైరల్ అవుతోంది.

మరిన్ని చదవండి ఇక్కడ: Samantha Painting Photos: నెట్టింట వైరల్ అవుతున్న ‘సమంత’ పెయింటింగ్ వేస్తున్న ఫొటోస్.. ఎవరి బొమ్మ గీసిందో చూడండి..

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Vijay Sethupathi Bike Photos: BMW బైక్ కొన్న ‘మక్కల్ సెల్వన్’.. స్వయంగా డ్రైవింగ్ చేస్తూ వెళ్లిన ‘విజయ్ సేతుపతి’.. వైరల్ అవుతున్న ఫొటోస్.. 
Naga Shourya Farm House: నాగశౌర్య ఫామ్ హౌస్ లో పేకాట రాయుళ్లు.. పోలీసుల విచారణలో సంచలన నిజాలు.. (లైవ్ వీడియో)