Loading video

తుది తీర్పు !! సుశాంత్ మరణానికి జస్టిస్‌ ఇదేనా ??

|

Mar 25, 2025 | 4:07 PM

సుశాంత్ సింగ్ రాజ్ పుత్! వరుస విజయాలను అందుకుంటూ ఫుల్ ఫాంలో ఉన్న ఓ యంగ్ హీరో ఉన్నట్లుండి ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో యావత్ దేశాన్ని కలచివేసింది. గత కొన్నేళ్లుగా సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ జరుపుతూనే ఉన్నారు. తాజాగా ఈ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎట్టకేలకు దర్యాప్తు పూర్తి చేసి, క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసింది.

జూన్ 14, 2020న ముంబైలోని బాంద్రాలోని తన నివాసంలో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసును గత నాలుగు సంవత్సరాలుగా దర్యాప్తు చేసిన సీబీఐ.. తుది నివేదికను కోర్టులో ప్రవేశపెట్టింది. ఆత్మహత్య కాదు.. హత్య అనడానికి సంబంధించిన ఆధారాలు ఏవి లభించలేదని వెల్లడించింది. ఇక సుశాంత్ మరణం తరువాత, ముంబై పోలీసులు ప్రాథమిక దర్యాప్తు నిర్వహించారు. నివేదిక ప్రకారం సుశాంత్ ఇంట్లోకి ఎవరూ బలవంతంగా ప్రవేశించినట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని.. ఆయన కొంతకాలంగా నిరాశతో ఉన్నాడని, సుశాంత్ మరణానికి ఇదే కారణం కావచ్చని పోలీసులు తెలిపారు. దానికి తోడు సుశాంత్ నివాసంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన కొన్ని వారాలలోనే ఆయన ప్రేయసి రియా చక్రవర్తి పై ఆరోపణలు వచ్చాయి. బీహార్‌లో దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో సుశాంత్ ను రియా పూర్తిగా డ్రగ్స్ బానిసగా మార్చేసి బలవంతంగా నిర్బంధించారని ఆరోపించారు. దీంతో ఈ విషయంపై బీహార్, మహారాష్ట్ర పోలీసుల మధ్య వివాదం చెలరేగింది. బీహార్ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించాలని సిఫార్సు చేయగా, కేంద్ర ప్రభుత్వం వెంటనే దానిని అంగీకరించింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కన్నప్ప ట్రోల్ చేసిన వారికి.. ఆ శివయ్య శాపం తగులుతుంది

పోలీసుల దెబ్బకు ఆగిపోయిన సుప్రీం హీరో సినిమా..

బిగ్ బాస్ హౌస్‌లో చీటింగ్ ఇలా జరుగుతుంది.. ! సంచలన విషయాలు బయటపెట్టిన శేఖర్ బాషా