75 దాటిన తర్వాత రజినీ ప్లాన్ మారిపోయిందా
రజినీకాంత్ సినిమాల వేగం తగ్గిందా? ఒకప్పుడు క్యూలో మూడు నాలుగు సినిమాలు పెట్టిన సూపర్ స్టార్, 'కూలీ' తర్వాత కొత్త ప్రాజెక్టులకు ఓకే చెప్పట్లేదు. వయసు (75+) కారణంగానా, లేక 'జైలర్' మినహా ఇతర సినిమాలు ఆశించినంత విజయం సాధించకపోవడమా కారణం? లోకేష్ కనకరాజ్, కమల్ మల్టీస్టారర్ సహా అనేక ప్రాజెక్టులపై సందిగ్ధత నెలకొంది. భవిష్యత్తులో రజినీ ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి?
నిన్నమొన్నటి వరకు ఒకేసారి మూడు నాలుగు సినిమాలు క్యూలో పెట్టిన రజినీకాంత్.. కూలీ తర్వాత స్లో అయిపోయారు. చాలా మంది దర్శకులు కథలు చెప్తున్నా కూడా సూపర్ స్టార్ మాత్రం ఓకే చెప్పట్లేదు. దీని వెనక రీజన్ ఏంటి.. కావాలనే స్లో అయ్యారా లేదంటే వయసు రీత్యా నెమ్మదించాలని రజినీ ఫిక్సయ్యారా..? అసలు సూపర్ స్టార్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి..? గత రెండు మూడేళ్లుగా వరస సినిమాలు చేసిన రజినీ సడన్‌గా స్లో అయ్యారు. తక్కువ గ్యాప్‌లోనే జైలర్, వేట్టయాన్, లాల్ సలామ్, కూలీ లాంటి సినిమాలు వచ్చాయి. ఇందులో జైలర్ మినహా ఏదీ ఆడలేదు. కూలీ కూడా ఏదో ఓ మోస్తరుగా ఆడింది కానీ హిట్టైతే కాదు. దీనికి 500 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది.. కానీ బ్రేక్ ఈవెన్ కోసమే 600 కోట్లు రావాలి. కూలీ సెట్స్‌పై ఉన్నపుడే జైలర్ 2కి ఓకే చెప్పారు సూపర్ స్టార్. దాంతో పాటు మరో ఇద్దరు ముగ్గురు దర్శకులతో సినిమాలు చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడవేం కనిపించట్లేదు. ముఖ్యంగా లోకేష్ కనకరాజ్‌తో ప్లాన్ చేసిన రజినీ, కమల్ మల్టీస్టారర్ కూడా లేదు. సుందర్ సితో కమిటైన ప్రాజెక్ట్ కూడా ఆదిలోనే ఆగిపోయింది. ఇందులోంచి తప్పుకున్నారాయన. జైలర్ 2 షూటింగ్ చివరిదశకి వచ్చేసింది. అయినా కూడా నెక్ట్స్ ప్రాజెక్ట్ లాక్ చేయలేదు సూపర్ స్టార్. రజినీ, కమల్ మల్టీస్టారర్ ఉందంటున్నా ఎప్పటికి మొదలవుతుందో క్లారిటీ లేదు. ఇదంతా చూస్తుంటే వయసు 75 దాటాక గ్యాప్ తీసుకుంటున్నారా.. ఇస్తున్నారా అనేది ఆసక్తికరంగా మారింది. ఒక్కటైతే నిజం.. మునపట్లా రజినీ వేగంగా సినిమాలైతే చేయట్లేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
2025లో మాయ చేసిన కొత్తమ్మాయిలు వీళ్లే
మెగా విక్టరీ సాంగ్.. థియేటర్లలో పూనకాలు ఖాయం
టాలీవుడ్ 2025 రివ్యూ.. ఈ ఏడాది మనోళ్లు సాధించిన విజయాలేంటి ??
Suresh Babu: ఫిల్మ్ ఛాంబర్ కొత్త అధ్యక్షుడు సురేష్ బాబు ఏడాదిలో ఏం చేయబోతున్నారు
