Mahesh Babu: కూతురితో కలిసి బుల్లితెరపై సందడి చేసిన సూపర్ స్టార్
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంకానుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంకానుంది. ఇందులో మహేష్ సరసన పూజా హెగ్డే నటించనున్నారు. అయితే చాలా రోజులుగా ఎస్ఎస్ఎంబీ 28 సినిమా అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్న తన ఫ్యాన్స్‌కు స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చేశారు మహేష్. తాజాగా ఓ డాన్స్ రియాల్టీ షోలో తన కూతురు సీతారతో కలిసి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఓ ప్రముఖ ఛానెల్ డాన్స్ ఇండియా డాన్స్ అనే రియాల్టీ షోను ప్రారంభిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుమార్తె సీతారతో కలిసి పాల్గొన్నారు. ఈ ప్రోమోలో మహేష్ మాట్లాడుతూ.. తనకు తెలిసి డాన్స్ అనేది ఓ సెలబ్రేషన్ అని అన్నారు. అనంతరం స్టేజ్ పై కంటెస్టెంట్లతో కలిసి సితార డాన్స్ చేసింది. సర్కారు వారి పాట చిత్రంలోని పెన్నీ సాంగ్ సిగ్నెచర్ స్టెప్ వేసి ఆకట్టుకుంది సితార. ఇక మహేష్ బాబు ఇలా ఓ రియాల్టీ షోలో పాల్గొనడం ఇదే తొలిసారి. ప్రోమో చూసిన ఫ్యాన్స్ మహేష్ న్యూలుక్ చూసి ఫిదా అవుతున్నారు. మొదటి సారి తమ అభిమాన హీరో రియాల్టీ షోలో సందడి చేయడంతో ఫుల్ ఖుషి అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వినాయక చవితి కోసం స్వయంగా గణేష్‌ని తయారు చేసుకున్న హీరోయిన్
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

