ఈ సినిమాతోనైనా నారా పరిస్థితి మారేనా? హిట్టా..? ఫట్టా..?

Updated on: Aug 28, 2025 | 9:37 PM

భైరవం సినిమాతో చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన నారా రోహిత్.. తాజాగా సుందరకాండ అంటూ మరోసారి వచ్చాడు. ఈసారి కొంచెం కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది పూర్తి రివ్యూ చూసి తెలుసుకుందాం.. సిద్ధార్థ్ అలియాస్ నారా రోహిత్ కు వయసు 35 దాటిన తర్వాత కూడా పెళ్లి కాదు.

ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా తనకు అమ్మాయిలో 5 క్వాలిటీస్ కావాలని పట్టుబడతాడు. దానికి కారణం చిన్నప్పుడు స్కూల్లో ఒక అమ్మాయిని ప్రేమించడం. ఆమెలో ఉన్న లక్షణాలు ఇంకో అమ్మాయిలో ఉంటేనే పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. అదే సమయంలో సిద్ధార్థ జీవితంలోకి ఆయన కోరుకున్న లక్షణాలతో ఐరా అలియాస్ వ్రితి వఘని వస్తుంది. ఆమెను చూసి ప్రేమిస్తాడు.. పెళ్లి కూడా చేసుకోవాలి అనుకుంటాడు. అదే సమయంలో తాను ప్రేమించిన ఐరాకు.. చిన్నప్పుడు తన స్కూల్లో ప్రేమించిన వైష్ణవి అలియాస్ శ్రీదేవి తో ఒక రిలేషన్ ఉందని తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.. పెద్ద సినిమాలతో పోలిస్తే చిన్న సినిమాల్లోనే అప్పుడప్పుడు మంచి మంచి బోల్డ్ కాన్సెప్టులు వస్తున్నాయి. అవి రాసుకునేటప్పుడు బాగానే ఉంటాయి కానీ స్క్రీన్ మీద తీసేటప్పుడు మాత్రం చాలా కష్టంగా అనిపిస్తాయి. బోల్డ్, వల్గర్.. ఈ రెండు జోనర్స్ మధ్య చిన్న లైన్ ఒకటి ఉంటుంది. ఏ మాత్రం గీతకు అటువైపు వెళ్లినా… సినిమా మొత్తం పాడైపోతుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకున్నాడు దర్శకుడు వెంకటేష్. సుందరకాండ కోసం ఆయన తీసుకున్నది కచ్చితంగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్.. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు స్క్రీన్ మీద దాన్ని ప్రజెంట్ చేయడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవన్నీ చాలా వరకు తీసుకున్నాడు వెంకటేష్. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాలోని చాలా సన్నివేశాలు రాసుకున్నాడు. దాన్ని పూర్తిగా ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లో చెప్పే ప్రయత్నం చేశాడు. అక్కడక్కడ అది వర్కౌట్ అయింది కూడా.. సుందరకాండ ఫస్టాఫ్ అంతా సరదాగా అలా వెళ్ళిపోతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఊహించదగ్గదే అయినా బాగుంది. అక్కడి నుంచి స్క్రీన్ ప్లే మరింత పకడ్బందీగా ఉంటే బాగుండేది.. ట్విస్ట్ రివీల్ చేసిన తర్వాత కూడా కథను వినోదాత్మకంగానే చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఈ క్రమంలోనే కొన్ని సన్నివేశాలు అంత కన్విన్సింగ్ గా అనిపించవు. కథ దారి తప్పుతున్న ప్రతిసారి తన కామెడీతో నిలబెట్టాడు సత్య. నారా రోహిత్ చెప్పింది నిజమే.. ఈ సినిమా వల్ల సత్యకు పెద్దగా యూజ్ ఉండదు కానీ సత్య వల్ల సినిమాకు చాలా యూజ్ ఉంది. సినిమా అంతా వన్ లైనర్స్ తో నవ్వించాడు. ఓవరాల్ గా చూసుకుంటే సుందరకాండ బాగానే మెప్పిస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇలాగైతే.. అమెరికాలో మనోళ్ల లైఫ్ కష్టమే గురూ

ఇస్రో ఎయిర్‌డ్రాప్‌ టెస్ట్‌ సక్సెస్‌ వ్యోమగాముల సేఫ్ ల్యాండింగ్‌కు మార్గం

వీడియో కోసం వెళితే.. ప్రాణాలే పోయాయి

ప్రేమకథకు గుర్తుగా.. రాళ్ల యుద్ధం.. ఈ జాతర ప్రత్యేకత అదే

OG: టాటూ కారణంగా.. బయటపడ్డ OG కథ