Sukesh-Jacqueline: ఈయనో రాముడు.. ఈమె సీత.! పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటున్న జనాలు..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సుకేష్ చంద్రశేఖర్‌తో చేసిన డేటింగ్ వివాదంలో చిక్కుకుంది. మనీలాండరింగ్ కేసులో ఇప్పుడు సుకేష్ చంద్రశేఖర్ జైల్లో ఉన్నాడు. అయినా జాక్వెలిన్ ను వెంటాడుతూనే ఉన్నాడు ఇతడు. తరచుగా జైలు నుండి జాక్వెలిన్ కు ఉత్తరాలు రాస్తూ జాక్విలిన్ పై తన ప్రేమను తెలిసేలా చేస్తూనే ఉన్నాడు సుకేష్. ఇక ఈ క్రమంలోనే దీపావళి సందర్భంగా తన ప్రియురాలి కోసం కొత్త లేఖ రాశాడు.
షాకింగ్‌గా ఈసారి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫ్యాన్స్‌కు కాస్ట్లీ గిఫ్ట్స్‌ను ఇస్తానని అనౌన్స్ చేశాడు సుఖేష్. దాంతో పాటే.. వెరీ షాకింగ్‌గా.. తనను రాముడిగా.. జాక్వలిన్‌ను సీతగా తన లేఖలో అభివర్ణించాడు. రియాక్షన్‌గా నెట్టింట ఫన్నీ మీమ్స్ వచ్చేలా చేసుకుంటున్నాడు,
తాజాగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కొత్త పాటను విడుదల చేసింది. యూట్యూబ్‌లో ఈ పాటను కామెంటు, లైకులు ,షేర్స్ చేసే అభిమానులకు సుకేష్ చంద్రశేఖర్ 25.. మహీంద్రా థార్ కార్లు, 200.. ఐఫోన్ 16 ప్రోలను బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. దీనిని చూసి జనాలు పిచ్చిపిచ్చిగా నవ్వుకుంటున్నారు. ఇక గతంలో సుకేష్ చంద్రశేఖర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సన్నిహితంగా ఉన్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వ వైరల్‌గా మారాయి. ఆ తర్వాత జైలు నుంచి ఎన్నో లేఖలు రాశాడు సుకేష్. అయితే జాక్విలిన్ నుంచి మాత్రం ఎలాంటి రియాక్షన్ లేదు. ఇక ఈ క్రమంలోనే ప్రస్తుతం మరో లేఖ రాశాడు సుకేష్. అందులో జాక్వెలిన్ గురించి ప్రేమగా మాట్లాడాడు. అంతేకాదు సుకేష్ చంద్రశేఖర్ తనను రాముడిగా, జాక్వెలిన్ సీతగా అభివర్ణించాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.