పాపం.. మాస్టర్ ప్రాణం తీసిన స్టంట్..
సిల్వర్ స్క్రీన్ పై మన స్టార్ హీరోల యాక్షన్ సీన్లు.. స్టంట్స్ చూసి తెగ ఎంజాయ్ చేస్తాం.. చప్పట్లు కొడతాం. క్రేజీ ఫీలింగ్‌కు లోనవుతాం. కానీ ఇదే సీన్లను కాస్త తెరవెనక్కి వెళ్లి చూస్తే మాత్రం... ఆ సీన్లలో నటించిన స్టంట్ మాస్టర్ల కష్టం మనకు కనిపిస్తుంది. ప్రాణాలను పనంగా పెట్టిన తీరు మనకు షాక్ కలిగేలా చేస్తుంది. కొన్ని సార్లు ప్రాణాలు పోయిన సంఘటనలు గురించి కూడా మనకు తెలుస్తుంది.
అయితే అలాంటి సంఘటనే ఇప్పుడు కూడా జరిగింది. కార్‌తో స్టంట్ చేస్తూ.. ఓ స్టంట్ మ్యాన్ మరణించడం ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలో హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం పా రంజిత్.. ఆర్య హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు రాజు స్టంట్ మాస్టర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ లో భాగంగా రాజ ఓ కారు స్టంట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. అన్ని జాగ్రత్తలు తీసుకునే స్టంట్‌ను కంపోజ్ చేసినప్పటికీ.. కారు పల్టీ కొట్టే సమంతో బలంగా దెబ్బలు తాకడంతో.. రాజు చినపోయినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు స్టంట్ చేసిన వీడియో కూడా ఇప్పుడు బయటికి వచ్చింది. అది కాస్తా నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పా రంజిత్ యాక్షన్ చెప్పగానే రాజు జెట్ స్పీడ్‌లో కార్ నడిపించి పల్టీలు కొట్టేలా చేయడం కనిపిస్తోంది. ఇక డైరెక్టర్ కట్ చెప్పగానే మిగిలిన టీం అందరూ పరిగెత్తి చూడగా… రాజు అపస్మారక స్థితిలో ఉన్నట్టు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బైకు ప్రమాదంలో కొడుకు మరణం.. లారీ గుద్దడంతో కూతురికి అవిటితనం! కోట బాధలు వింటే కన్నీళ్లే
2 కోట్లతో సొంతూరిలో ఆసుపత్రి.. ఇంకా ఎన్నో.. బయటికొచ్చిన ఆర్. నారాయణ మూర్తి గొప్పతనం
ఛావా రికార్డు బ్రేక్ చేసిన 3 కోట్ల మూవీ.. చూస్తే వణికిపోవాల్సిందే
రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.1600 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ..