Star Heroines: రెమ్యునరేషన్ లో పోటీ పడుతున్న స్టార్ హీరోయిన్స్.!

|

Jul 30, 2024 | 8:31 PM

రోజుకో కొత్త హీరోయిన్ వ‌స్తున్న సినీ ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకుని ఉండ‌టం అంటే మాట‌లు కాదు. పోటీ ఆ రేంజ్ లో ఉంటది. మరి ఈ పోటీ రెమ్యూనరేషన్ విషయంలో ఎలా ఉందో చూదామా ? బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె. ప్రస్తుతం ఈమె బాలీవుడ్, టాలీవుడ్‌నే కాకుండా హాలివుడ్‌లో నటిస్తోంది. 17 ఏళ్లుగా స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న దీపికా పదుకొణె స్టార్‌డమ్, ఆస్తుల పరంగా భారతదేశపు అగ్రగామి నటీమణులలో ఒకరు.

రోజుకో కొత్త హీరోయిన్ వ‌స్తున్న సినీ ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకుని ఉండ‌టం అంటే మాట‌లు కాదు. పోటీ ఆ రేంజ్ లో ఉంటది. మరి ఈ పోటీ రెమ్యూనరేషన్ విషయంలో ఎలా ఉందో చూదామా ??

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె. ప్రస్తుతం ఈమె బాలీవుడ్, టాలీవుడ్‌నే కాకుండా హాలివుడ్‌లో నటిస్తోంది. 17 ఏళ్లుగా స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న దీపికా పదుకొణె స్టార్‌డమ్, ఆస్తుల పరంగా భారతదేశపు అగ్రగామి నటీమణులలో ఒకరు. రెమ్యునరేషన్ విషయానికొస్తే బాలీవుడ్‌లో దీపికా పదుకొణే అత్యధిక పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. నివేదికల ప్రకారం.. ఈమె ఒక చిత్రానికి 15-20 కోట్ల పారితోషకం అందుకుంటుందట. అతిథి పాత్రకు కూడా ఈ నటి 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు తీసుకుంటుందని సమాచారం. ఈ విషయంలో తన భర్త కంటే ఎక్కువ సంపాదిస్తుందంట. ఈ బ్యూటీ నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ హిట్స్ అయ్యాయి. కల్కి రికార్డు కలెక్షన్లు సాధించింది. సినిమాలే కాక పలు యాడ్స్, ప్రకటన ద్వారా కూడా ఈమె భారీగానే సంపాదిస్తోంది.

అత్యధిక పారితోషం అందుకున్న వారిలో దీపికా తర్వాతి స్థానంలో అలియా భట్ ఉంది. అలియా ఓ చిత్రానికి 15 కోట్ల వరకు పారితోషకం అందుకుంటుందట. దర్శకుడు మహేష్ భట్ కుమార్తె అయినప్పటికీ..అలియా భట్ తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎట్ ప్రజెంట్ రాహా ఆలనా పాలనలో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. తాజాగా హార్ట్ ఆఫ్ స్టోన్ అనే హాలీవుడ్ సినిమాలో యాక్ట్ చేస్తోంది.

ఇక అత్యధిక పారితోషకం అందుకుంటున్న వారిలో కరీనా కపూర్ మూడో స్థానంలో ఉంది. ఈమె ఒక్కో సినిమాకు 8 నుంచి 11 కోట్ల అందుకుంటోంది. ప్రస్తుతం ఈమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇక ఈ లిస్ట్‌లో కత్రినా కైఫ్, శ్రద్ధా కపూర్ లు కూడా ఒక్కో సినిమాకి 8-10 కోట్లు సంపాదిస్తూ బీటౌన్ హాట్ బ్యూటీల లిస్టులో టాప్లోనే కొనసాగుతున్నారు. కృతిసనం, కియారా అద్వానీ, కంగనా, తాప్సీ పన్ను కూడా కాస్త గట్టిగా రెమ్యునరేషన్‌ వర్కవుట్ చేస్తుకుంటూ.. ఎండోర్స్ పేరుతో..రెండు చేతులా సంపాదిస్తున్నారు.

మరి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో హీరోయిన్స్ రెమ్యూనరేషన్ ఎంత?
ఓ లుక్ ఎద్దామా??

రోజుకో కొత్త హీరోయిన్ వ‌స్తున్న ఈ ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకుని ఉండ‌టం అంటే మాట‌లు కాదు. ఇప్పుడు తెలుగులో లెక్క‌పెడితే అర‌డ‌జ‌న్ మంది స్టార్ హీరోయిన్లు కూడా లేరు. కానీ వాళ్ల రెమ్యున‌రేష‌న్స్ మాత్రం ఓ రేంజ్లో ఉన్నాయి. ఆకాశాన్ని తాకేస్తున్నాయి. అస‌లు తెలుగులో ఎవ‌రెవ‌రు ఎంత పారితోషికం అందుకుంటున్నారో తెలుసా..?

అనుష్క శెట్టి కొద్ది రోజుల క్రితం మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టితో బంపర్ హిట్ అందుకుంది. నయ‌న‌తార తర్వాత అనుష్క కూడా అంతే. ఈ ఇద్దరూ కూడా ఒక్కో సినిమాకు 4 కోట్ల వ‌ర‌కు పారితోషికం అందుకుంటున్నారట.

స‌మంత కూడా రెమ్యునరేషన్ విషయంలో అస్సలు తగ్గనంటుంది. ప్రస్తుతం ఈమె రెమ్యునరేషన్ 3 కోట్లు వరకు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. రీసెంట్ గా తాను నటిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్‌లోనూ దిమ్మతిరిగే రేంజ్‌లో రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలుస్తోంది.

కన్నడ స్టేట్‌ నుంచి నేషల్ క్రష్‌గా మారిన రష్మిక మందన్న ఒక్కో సినిమాకు 4 నుంచి 3.50 కోట్లు… తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్‌లో యానిమల్ తో బంపర్ హిట్‌ కొట్టిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం పుష్ప 2లో నటిస్తోంది. ఈ సినిమా హిట్టైయితే.. ఈమె రేంజ్ మారిపోవడం పక్కా అని.. రెమ్యునరేషన్‌ అమాంతంతా పెంచేయడం ఖాయమని ఇన్‌సైడ్ టాక్.

సినిమాలు.. వెబ్ సిరీస్‌లు.. ఐటెం సాంగ్స్‌ అంటూ.. ఎదురొచ్చిన ప్రాజెక్ట్‌ చేసుకుంటూ పోతున్న తమన్నా.. కూడా రెమ్యునరేషన్‌ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఒక్కో సినిమాకు.. రెండు చొప్పున్న తీసుకుంటున్నట్టు రిపోర్ట్. అంతేకాదు ఐటెం సాంగ్‌కు కూడా కోటి లేనిదే.. నో చెబుతోంది ఈ బ్యూటీ. ఇలా సినిమాల కంటే.. ఐటెం సాంగ్స్‌తోనే ఎక్కువగా కామాయిస్తోంది. రీసెంట్ గా రిలీజ్‌ అయిన హార్రర్ కామెడీ ఫిల్మ్ స్త్రీలోనూ.. ఓ మాంచి ఐటెం సాగ్‌ చేసి ఇప్పుడు త్రూ అవుట్ ఇండియా వైరల్‌ అవుతోంది.

ఎట్ ప్రజెంట్ బాలీవుడ్ రామాయణ సినిమాలో సీతగా యాక్ట్ చేస్తున్న సాయి పల్లవి కూడా.. ఒక్కో సినిమాకు 2 కోట్ల వరకు ఫీజు తీసుకుంటుందని అంచనా.. ప్రస్తుతం నాగచైతన్య తో కలిసి తండేల్ సినిమా చేస్తున్న ఈమె.. ఈ సినిమాతో తొందర్లో తన తెలుగు టూ స్టేట్స్‌ ఫ్యాన్స్ ను పలకరించనుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.