Boomer Uncle: సూపర్ హిట్ బూమర్ అంకుల్.. తెలుగులోకూ వస్తున్నాడు..

|

Jul 18, 2024 | 12:12 PM

కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగిబాబు ఈ మధ్యన హీరోగానూ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కమెడియన్ గా అదరగొడుతోన్న ఆయన.. మరోవైపు సోలో హీరోగానూ సత్తా చాటుతున్నాడు. అలా యోగిబాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘బూమర్ అంకుల్’. మార్చి 29న కోలీవుడ్ థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం అక్కడి జనాలను బాగానే ఆకట్టుకుంది. ఎప్పటిలాగే యోగిబాబు తన దైన కామెడీ స్టైల్ తో ఆడియెన్స్ ను మెప్పించారు.

ఇక ఇప్పుడీ బూమర్ అంకుల్ మూవీ తెలుగులో ఓటీటీలోకి రానుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చింది. జులై 20వ తేదీ నుంచి బూమర్ అంకుల్ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది ఆహా. ఈ మేరకు బూమర్ అంకుల్ సినిమాకు సంబంధించి ఒక కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. ‘ఫన్నీ బూమర్ అంకుల్’.. మిమ్మల్ని మరింత గట్టిగా నవ్విస్తాడు’ అని దీనికి క్యాప్షన్ జత చేసింది.

బూమర్ అంకుల్ తమిళ్ వెర్షన్ ఇప్పటికే ఆహా తమిళ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. స్వదేశ్ ఎంఎస్ తెరకెక్కించిన ఈ సినిమాలో యోగిబాబు, ఒలివా ప్రధాన పాత్రలు పోషించారు. అంకా మీడియా పతాకంపై అన్బు, కార్తీక్ కే తలై నిర్మించిన ఈ సినిమాకు ధర్మ ప్రకాశ్, సంతన్ అనబజేగానే సంగీతం అందించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. బూమర్ అంకుల్ మూవీలో నేసమ్‌ అలియాస్ యోగిబాబు.. అమీ అలియాస్ ఓవియా దంపతులుగా కనిపిస్తారు. విదేశీ యువతి అమీతో నేసమ్‌కు పరిచయం ఏర్పడటం.. ఆపై పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. అయితే వారు ఎందుకు విడాకులు తీసుకోవాలనుకున్నారు..? అలాగే విడాకులు ఇవ్వాలనునే భర్తపై భార్య పగతీర్చుకోవాలని అనుకోవడం ఇలా కామెడీ ప్రధానంగా ఈ సినిమా సాగుతుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.