Baahubali: బాహుబలి వరల్డ్‌ నుంచి మరో బిగ్ రివీల్‌

Edited By:

Updated on: Nov 06, 2025 | 5:09 PM

బాహుబలి అనే ఐకానిక్ క్యారెక్టర్‌ను సృష్టించి పదేళ్లు దాటినా... ఇంకా ఆ వరల్డ్ నుంచి కొత్త కంటెంట్ వస్తూనే ఉంది. ప్రజెంట్ బాహుబలి ది ఎపిక్‌ను ఎంజాయ్ చేస్తున్న ఫ్యాన్స్‌కు మరో అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ వర్డల్ నుంచి మరో ఇంట్రస్టింగ్ మూవీ ఆడియన్స్‌ ముందుకు రాబోతుందని ఎనౌన్స్ చేశారు. బాహుబలి 2 రిలీజ్ అయిన దగ్గర నుంచి త్రీక్వెల్ కావాలన్న డిమాండ్స్ గట్టిగా వినిపిస్తున్నాయి.

మేకర్స్ కూడా పార్ట్ 3 చేసే ఆలోచన ఉందన్న విషయాన్ని ఆల్రెడీ కన్ఫార్మ్ చేశారు. అయితే అంతకన్నా ముందు మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్‌తో ఆడియన్స్ ముందుకు రాబోతోంది బాహుబలి టీమ్‌. బాహుబలి కథలోని కీలక పాత్రల నేపథ్యంలో ఓ యానిమేషన్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. బాహుబలి ది ఎటర్నల్‌ వార్‌ పేరుతో ఓ యానిమేషన్ యాక్షన్ సిరీస్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ సిరీస్‌లో తొలి భాగానికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు. యానిమేషన్ మూవీస్‌ను రూపొందించటంలో స్పెషలిస్ట్‌గా పేరున్న ఇషాన్‌ శుక్లా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ‘అమరేంద్ర బాహుబలి మరణం కథకు ముగింపు కాదు… మరో కొత్త కథకు ప్రారంభం’ అంటూ ఈ టీజర్‌ను రిలీజ్ చేసింది యూనిట్‌. బాహుబలి ది ఎపిక్‌తో పాటు ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసింది యూనిట్‌. యానిమేషన్ మూవీకి ఇషాన్‌ దర్శకత్వం బాధ్యతలు తీసుకున్నా… రాజమౌళి కూడా ఈ ప్రాజెక్ట్‌తో అసోసియేట్ అయ్యారు. జక్కన్న సమర్పణలో శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రజెంట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న ఈ మూవీని 2027లో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Akshay Kumar: అక్షయ్ డెడికేషన్ గురించి చిన్ని ప్రకాష్ కామెంట్

శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ.. రన్‌వే అవసరం లేని విమానం

టెన్త్‌ అర్హతతో రైల్వే ఉద్యోగం.. రాత పరీక్ష లేకుండానే

అయ్యో..రక్షించేవారే లేరా.. ఏనుగుల ఆక్రందన

టీచర్లు కాదు.. రాక్షసులు.. బాలుడి ప్యాంటులో తేలును వదిలి ..