శ్రీలీలకు షాక్… కెరీర్ గాడిలో పడేదెప్పుడు?వీడియో
ఒకప్పుడు సంచలనం సృష్టించిన నటి శ్రీలీల ప్రస్తుతం కెరీర్‌లో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వరుస పరాజయాలు ఆమెను ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఇతర భాషల్లో చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఇప్పుడు ఆమె ఆశలన్నీ పవన్ కల్యాణ్ సరసన నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపైనే ఉన్నాయి. ఈ సినిమాతో మళ్లీ కెరీర్ గాడిలో పడుతుందని ఆమె నమ్ముతున్నారు
ఒకప్పుడు వెండితెరపై సంచలనం సృష్టించిన నటి శ్రీలీల ప్రస్తుతం కెరీర్‌లో ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నారు. వరుస పరాజయాలతో ఆమె కెరీర్ కష్టాల్లో పడిందని వార్తలు వస్తున్నాయి. తెలుగులో ఆశించిన విజయాలు దక్కకపోవడంతో, ఇతర భాషల్లోనూ ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. మళ్లీ మంచి రోజులు ఎప్పుడొస్తాయా అని శ్రీలీల ఎదురుచూస్తున్నారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో శ్రీలీల తెరంగేట్రం చేశారు. తొలి చిత్రంతోనే నటన, నాట్యంతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ధమాకా, భగవంత్ కేసరి వంటి హిట్స్ వచ్చినా, స్కంద, ఆదికేశవ వంటి సినిమాలు ఆమె కెరీర్‌ను ఇబ్బందుల్లోకి నెట్టాయి
మరిన్ని వీడియోల కోసం :
