అందాల భామలకు తలనొప్పిగా మారిన రూమర్స్‌..

Updated on: Oct 23, 2025 | 7:43 PM

సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలకు, ముఖ్యంగా హీరోయిన్లకు రూమర్స్ పెను సవాల్‌గా మారాయి. త్రిష, సోనాక్షి సిన్హా, మృణాల్ ఠాకూర్ వంటి నటీమణులు తమపై వస్తున్న పుకార్లకు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. పెళ్లి, ప్రెగ్నెన్సీ వంటి ఫేక్ న్యూస్‌తో వీరు తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంజలి, అనుపమ, శ్రుతి హాసన్, సాయి పల్లవి వంటి పలువురు కూడా ఈ జాబితాలో ఉన్నారు.

సోషల్ మీడియా జమానాలో సెలబ్రిటీలు, ముఖ్యంగా సినీ తారలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అవాస్తవ వార్తలు, పుకార్లు వారి వ్యక్తిగత జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మొదట్లో ఈ రూమర్స్‌ను లైట్ తీసుకున్నప్పటికీ, శ్రుతి మించినప్పుడు తారలు గట్టిగానే స్పందిస్తున్నారు. దక్షిణాది సీనియర్ నటి త్రిష పెళ్లి వార్తలు ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటాయి. ఈ క్రమంలోనే ఇటీవల మరోసారి ఆమె పెళ్లి వార్త వైరల్ అయ్యింది. దీనిపై త్రిష స్పందిస్తూ, “నా జీవితాన్ని ప్లాన్ చేస్తున్న వారు నా హనీమూన్ షెడ్యూల్ గురించి కూడా చెబుతారేమోనని ఎదురుచూస్తున్నాను” అంటూ సెటైర్ వేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సమంత హింట్‌ దాని గురించేనా ??

OG: ఓజీ సీక్వెల్‌ ఉన్నట్టా.. లేనట్టా

మహేష్ ఫ్యాన్స్ బీ రెడీ.. ముహూర్తం ఫిక్స్ చేసిన రాజమౌళి

దర్శకులతో విశాల్‌కు పడట్లేదా ?? మకుటం సినిమాను టేకోవర్ చేసిన తమిళ హీరో

రూ.700 పలుకుతోన్న కిలో టమోటా.. ఇంకేం తింటారు