Ayalaan: తెలుగోళ్ల దాటికి అటకెక్కిన అయలాన్.! కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే.?
గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి సంక్రాంతికి బోలెడన్ని సినిమాలు రిలీజ్ కానున్నాయి. మొదట తెలుగులోనే ఏకంగా ఐదు సినిమాలు పొంగల్ బరిలో నిలిచాయి. పైగా అన్నీ స్టార్ హీరోల సినిమాలే. దీంతో థియేటర్లను వెతుక్కోవడం నిర్మాతలకు తలకు మించిన భారంగా మారింది. దీంతో ముందు జాగ్రత్తగా రవితేజ ఈగల్ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది. ప్రస్తుతం నాలుగు సినిమాలు పొంగల్ రేసులో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. వీటికి కూడా థియేటర్ల కేటాయింపుపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. అయితే తెలుగు సినిమాలకు తోడు ఈసారి రెండు తమిళ చిత్రాలు కూడా సంక్రాంతికి వద్దామనుకున్నాయి. అందులో ఒకటి ధనుష్ కెప్టెన్ మిల్లర్ కాగా, మరొకటి శివ కార్తికేయన్ నటించిన అయలాన్.
గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి సంక్రాంతికి బోలెడన్ని సినిమాలు రిలీజ్ కానున్నాయి. మొదట తెలుగులోనే ఏకంగా ఐదు సినిమాలు పొంగల్ బరిలో నిలిచాయి. పైగా అన్నీ స్టార్ హీరోల సినిమాలే. దీంతో థియేటర్లను వెతుక్కోవడం నిర్మాతలకు తలకు మించిన భారంగా మారింది. దీంతో ముందు జాగ్రత్తగా రవితేజ ఈగల్ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది. ప్రస్తుతం నాలుగు సినిమాలు పొంగల్ రేసులో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. వీటికి కూడా థియేటర్ల కేటాయింపుపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. అయితే తెలుగు సినిమాలకు తోడు ఈసారి రెండు తమిళ చిత్రాలు కూడా సంక్రాంతికి వద్దామనుకున్నాయి. అందులో ఒకటి ధనుష్ కెప్టెన్ మిల్లర్ కాగా, మరొకటి శివ కార్తికేయన్ నటించిన అయలాన్. రెండు స్టార్ హీరోల సినిమాలే. తెలుగులోనూ వీరికి మంచి క్రేజ్ ఉంది. కానీ ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితిని ముందే గ్రహించి ధనుష్ కెప్టెన్ మిల్లర్ వాయిదా పడింది. ఇక ఇప్పుడు శివకార్తికుఏయన్ అయలాన్ కూడా… అదే దారిని ఎంచుకుంది.
శివ కార్తి కేయన్ అయలాన్ సినిమా మాత్రం తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ చేయాలని నిర్మాతలు భావించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు డబ్బింగ్ రైట్స్ కొనడంతో కొన్ని థియేటర్లైనా దక్కుతాయనుకున్నారు. అయితే ఇప్పుడు అయలాన్ సినిమా రిలీజ్ కూడా వాయిదా పడింది. సరిపడా థియేటర్లలు లేకపోవడమే అయలాన్ తెలుగు వెర్షన్ వాయిదాకు కారణమని తెలుస్తోంది. సంక్రాంతి సీజన్ ముగిసిన తర్వాతే అంటే జనవరి 12 లేదా 19న శివ కార్తి కేయన్ సినిమా తెలుగులో విడుదల కావొచ్చని తెలుస్తోంది. ఇక రవి కుమార్ తెరకెక్కించిన అయలాన్ సినిమాలో శివకార్తికేయన్ జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తుంది. ఇషా కొప్పికర్, శరత్ కేల్కర్, భాను ప్రియ, యోగిబాబు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ఏలియన్ పాత్రకు హీరో సిద్ధార్థ్ వాయిస్ అందించడం విశేషం. ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos