Bigg Boss 7 Telugu Voting: దిమ్మతిరిగే పంచ్.! అట్టడుగు స్థానంలో ఇద్దరు మిత్రులు..
బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తోన్న బిగ్ బాస్ రియాల్టీ షో తొమ్మిదో వారంలోకి అడుగుపెట్టింది. ఇక ఈ వారం నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా... డ్రాగన్ స్నేక్ టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్ ఒక్కొక్క కంటెస్టెంట్ ఇద్దరు పేర్లను నామినేట్ చేయమని సూచించారు. అలా తొమ్మిదో వార మొత్తం 8 మంది కంటెస్టెంట్లు నామినేషన్స్‌లోకి వచ్చారు. వారిలో ప్రియాంక జైన్, ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, టేస్టీ తేజా, రతికా రోజ్, అమర్ దీప్, అంబటి అర్జున్, భోలే షా వళి ఉన్నారు.
బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తోన్న బిగ్ బాస్ రియాల్టీ షో తొమ్మిదో వారంలోకి అడుగుపెట్టింది. ఇక ఈ వారం నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా… డ్రాగన్ స్నేక్ టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్ ఒక్కొక్క కంటెస్టెంట్ ఇద్దరు పేర్లను నామినేట్ చేయమని సూచించారు. అలా తొమ్మిదో వార మొత్తం 8 మంది కంటెస్టెంట్లు నామినేషన్స్‌లోకి వచ్చారు. వారిలో ప్రియాంక జైన్, ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, టేస్టీ తేజా, రతికా రోజ్, అమర్ దీప్, అంబటి అర్జున్, భోలే షా వళి ఉన్నారు. ఇదిలా ఉంటే.. తొమ్మిదో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ మంగళవారం అంటే… అక్టోబర్ 31 రాత్రి 10.30 గంటల నుంచి ప్రారంభం అయింది. అయితే సీజన్ ప్రారంభ నుంచి ఎవరి ఊహలకు అందని విధంగా ఓటింగ్ సాగుతోంది. ఈ వారం అనూహ్యంగా ప్రిన్స్ యావర్ అగ్రస్థానంలో దూసుకెళుతున్నాడు. ఇప్పటివరకు అతని ఒక్కడికే 20 శాతం వరకు ఓట్లు పడ్డాయని తెలుస్తోంది. ఇక రెండో స్థానంలో పాట బిడ్డ భోలే షా వళి ఉన్నాడు. అతనికి 18 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక మూడో స్థానంలో సీరియల్ బ్యాచ్ లీడర్ అమర్ దీప్ చౌదరి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అతనికి 13 శాతం ఓట్లు పడ్డాయి. ఇక 10.9 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో రతికా రోజ్.., 10.6 శాతం ఓట్లతో అంబటి అర్జున్ ఐదో ప్లేస్‌లో, 10.27 శాతం ఓటింగ్ తో టేస్టీ తేజా ఆరో స్థానంలో ఉన్నారు. అయితే అనూహ్యంగా బిగ్ బాస్ స్ట్రాంగ్ అండ్ టాప్ కంటెస్టెంట్లుగా పేరున్న ప్రియాంక జైన్, శోభా శెట్టి ఈ వారం ఓటింగ్‌లో అట్టడుగున స్థానానికే పరిమితమయ్యారు. ప్రియాంక జైన్ 7 శాతం ఓట్లతో ఏడో స్థానంలో ఉండగా, శోభా శెట్టికి మరీ దారుణంగా 4 శాతం ఓట్లతో చివరి స్థానంలో ఉన్నారు. దీంతో ప్రస్తుతానికి ప్రియాంక, శోభా శెట్టిలే డేంజర్ జోన్‌కే వీరిద్దరూ పరిమితమయ్యారు. అయితే ఈ వారం చివరికి ఈ లెక్క మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు శోభ, ప్రియాంక ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos