క్రేజీ న్యూస్.. NTR సినిమాలో షారుఖ్ ఖాన్

|

Oct 23, 2024 | 2:07 PM

ఇటీవలే దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద దాదాపు 500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు హిందీలో వార్ 2 చిత్రంలో నటిస్తున్నాడు తారక్. ఇందులో హృతిక్ రోషన్‌తో స్క్రీన్‌ షేర్ చేసుకోబోతున్నారు. అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి మరో క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోన్న ఈ స్పై యూనివర్స్ లో వచ్చిన వార్, పఠాన్, టైగర్ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఇప్పుడు వార్ 2 చిత్రంలో షారుఖ్ ఖాన్ అతిధి పాత్రలో కనిపించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా కోసం యష్ రాజ్ ఫిల్మ్స్ భారీ పెట్టుబడి పెడుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను ముంబైలో చిత్రీకరిస్తున్నారు. ఇక వచ్చే ఏడాది మే నెలాఖరులోగా షూటింగ్‌ని పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 2025లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Chandrababu Naidu Season 4: తన అరెస్ట్ గురించి చెబుతూ చంద్రబాబు ఎమోషనల్

వీరిద్దరూ విడిపోవడానికి.. ఆ హీరోయినే కారణమా ??

Ram Charan: వచ్చే వేసవి నాటికి చెర్రీ మైనపు విగ్రహం రెడీ !!

బంగారానికి బాబులా వెండి ధర.. కిలో రూ.1 లక్ష.. కొంటే మంచిదేనా ??

రోజుకు ఒక గుప్పెడు తిన్నా.. ఊహించలేనన్ని బెనిఫిట్స్ !!

 

Follow us on