ప్రస్తుతం శ్రీవాణి క్రమంగా కోలుకుంటోంది. ఈ మేరకు తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసిందీ. ఈ సందర్భంగా తన క్షేమం కోసం ప్రార్థించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. తనకు యాక్సిడెంట్ అయినప్పుడు ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారని చెప్పిన ఆమె.. అక్కడ వాళ్లు తనకు చికిత్స చేయకుండా మరీ నీచంగా చూశారని చెప్పింది. ఇది యాక్సిడెంట్ కేసు కావడంతో ఒక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక కానిస్టేబుల్ చెప్పిన ఆన్సర్ తమకు కోపం తెప్పించిందని చెప్పింది. కనీసం ఆస్పత్రిలో తనకు ప్రథమ చికిత్స కూడా అందించకుండా అలానే చూస్తూ ఉండడం బాధేసింది అని చెప్పింది.
ఆ తర్వాత ఎలాగోలా వేరే హాస్పిటల్‌కి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకున్నానని చెప్పింది శ్రీవాణి. అక్కడ డాక్టర్లు ముఖం మీద కట్ అయిన భాగానికి 20 కుట్లు వేశారని చెప్పింది. అంతేకాదు తనను బాగా చూసుకున్నారని ఎమోషనల్ అయింది. అంతేకాదు ఈ క్లిష్ట సమయంలో ఎంతోమంది స్నేహితులు, సన్నిహితులు తనకు ఫోన్ చేశారంది. తన క్షేమ సమాచారాల గురించి అడిగారని.. వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలని శ్రీవాణి చెప్పింది. కానీ రక్తపు మడుగులో ఉన్న తనను చూసి తన భర్త విక్రమాదిత్య పిచ్చోడయిపోయాడు అంటూ మరోసారి ఆ వీడియోలో ఎమోషనల్ అయింది శ్రీవాణి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.