Spirit: స్పిరిట్ కు అప్పుడే లాభాల పంట
ప్రభాస్ 'స్పిరిట్' సినిమా రిలీజ్‌కు ముందే భారీ డీల్‌తో వార్తల్లో నిలిచింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్ర డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుంది. హీరో, దర్శకుల రెమ్యునరేషన్లు తీసేసిన తర్వాత మిగిలిన బడ్జెట్ కంటే అధిక మొత్తానికి ఈ డీల్ కుదిరినట్టు తెలుస్తోంది. దీంతో థియేట్రికల్ కలెక్షన్లతో సంబంధం లేకుండానే సినిమాకు లాభాలు ఖాయమైనట్టైంది.
హిట్సు..ఫ్లాప్స్‌తో పనిలేకుండా.. మినిమం 200 కోట్ల కలెక్షన్స్‌ను కమాయించే స్టామినా ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు మరోసారి అంతటా హాట్ టాపిక్‌గా మారాడు. తన అప్‌కమింగ్ సినిమా స్పిరిట్ రిలీజ్‌కు ముందే.. భారీగా రిటర్న్స్ జరిగేలా.. బిగ్ డీల్ జరగడంతో.. ఇప్పుడు ఇండస్ట్రీలో సెన్సేషన్ అయిపోయాడు. రాజాసాబ్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర కాస్త సైలెంట్ అయిపోన రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఒక న్యూస్ బయటికి వచ్చింది. ప్రభాస్ స్పిరిట్ మూవీ ఓటీటీ రైట్స్ భారీ ధరకు నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్టు న్యూస్ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. హీరో, డైరెక్టర్ల రెమ్యునరేషన్లు తీసేశాక… సినిమా బడ్జెట్ ఎంతుంటుందో.. అంతకంటే కూడా ఎక్కువ ధరకే నెట్‌ఫ్లిక్స్ .. స్పిరిట్ రైట్స్ ను కోట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక నెట్‌ఫ్లిక్స్ ఆఫర్ చేసిన ఫిగర్ నచ్చడంతో… సందీప్ రెడ్డి వంగా కూడా డీల్ క్లోజ్ చేసినట్టుగా న్యూస్. అంటే థియేటర్ కలెక్షన్స్ తో పని లేకుండా స్పిరిట్ మూవీకి పెట్టిన పైసలు వచ్చినట్టే అన్న టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: సినిమాల రేసులో వెనకబడుతున్న చరణ్
Jana Nayagan: ఆ కారణంగానే జన నాయగన్ ఇబ్బందుల్లో పడ్డాడా?
Om Shanti Shanti Shantihi: ఓం శాంతి శాంతి శాంతిః.. భార్యాభర్తల కామెడీ డ్రామా హిట్టా..? ఫట్టా..?
