షాజహాన్ – ముంతాజ్ మెచ్చిన రింగ్‌తో నిశ్చితార్థం !! సమంత ఆలోచన వెరీ స్పెషల్
సమంత పెళ్లి ఫోటోలలో ఆమె చేతికి ఉన్న మొఘల్ కాలం నాటి పోర్ట్రెయిట్ కట్ డైమండ్ రింగ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆమె భూత శుద్ధి వివాహ పద్ధతితో పాటు, ఈ అరుదైన ఉంగరం కూడా హాట్ టాపిక్‌గా మారింది. బలం, స్వచ్ఛతకు చిహ్నమైన ఈ రింగ్ డిజైన్, మొఘల్ చక్రవర్తుల కాలంలో ప్రసిద్ధి చెందింది. సమంత ప్రత్యేక అభిరుచికి ఇది నిదర్శనం.
సమంత షేర్ చేసిన తన పెళ్లి ఫోటోల్లో రెండు విషయాలు అందర్నీ అట్రాక్ట్ చేస్తున్నాయి. అందులో ఒకటి భూత శుద్ధి పెళ్లి ప్రక్రియ అయితే.. ఇంకోటి.. ఆమె చేతికున్న డైమెండ్ రింగ్. ఎస్ ! ఎప్పుడూ తన ఎంపికతో ప్రత్యేకత చాటుకునే సమంత.. తన డైమెండ్ రింగ్‌తోనూ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నారు. గతంలో జనవరిలోనే పోస్ట్ చేసిన ఓ పోస్ట్‌లోనే.. సమంత చేతికి ఓ ప్రత్యేకమైన డైమండ్ రింగ్ కనిపించింది. దీంతో అప్పుడందరూ సమంతకు ఎంగేజ్‌మెంట్ జరిగిపోయిందంటూ నెట్టింట కోడై కూశారు. కానీ సమంత సైలెంట్ మెయిన్ టేన్ చేసే సరికి.. ఆ విషయాన్ని వదిలేశారు. ఇక తాజాగా సమంత మళ్లీ పెళ్లి చేసుకున్న ఫోటోలు బయటికి రావడంతో.. మళ్లీ ఆ రింగ్‌ను గుర్తించిన జనం..ఈ రింగ్ గురించి ఆరా తీయడం షురూ చేశారు. ఈ క్రమంలోనే ఈ రింగ్ మొఘల్ కాలం నాటి ప్రత్యేక డిజైన్ అని తెలియడంతో… సామ్ టేస్ట్ చూసి అవాక్కవుతున్నారు. అంతేకాదు మొఘల్ కాలంలో ఇప్పుడు సమంత పెట్టకున్న తరహా ఉంగరాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారని ఓ ప్రముఖ జ్యువెలరీ వ్యాపారీ వివరించారు.ఇది పోట్రెయిట్ కట్ డైమండ్ రింగ్ అని ఆమె చెప్పారు. పోట్రెయిట్ కట్‌ను బలం, తేజస్సు, స్వచ్ఛమైన స్వభావానికి చిహ్నంగా భావిస్తారు. మొదటిసారి మొఘల్ కాలంలో దీన్ని తయారుచేశారు. వజ్రాన్ని ప్రత్యేక విధానంలో కట్ చేసి పలుచని గాజు పలకలా తయారుచేస్తారు. ఈ రకమైన ఉంగరాలను అరుదుగా తయారుచేస్తారు అని ఆమె వివరించారు. తాజ్ మహల్‌ను నిర్మించిన మొఘల్ చక్రవర్తి షాజహాన్ భార్య ముంతాజ్‌కు ఈ రకమైన ఉంగరం అంటే ఇష్టమని చరిత్రకారులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. గతంలో బాలీవుడ్ తారలు అలియా భట్ ధరించిన ఓవల్ షేప్ డైమండ్ రింగ్, ప్రియాంక చోప్రా ఎంపిక చేసుకున్న క్లాసిక్ కుషన్ కట్ రాక్, కత్రినాకైఫ్ రాచరిక స్ఫూర్తితో చేయించుకున్న నీలం ఉంగరాల కంటే సమంత భిన్నంగా ఎంపిక చేసుకోవడం.. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ !! గురువేమో నామినేషన్స్‌లో..శిష్యుడు డేంజర్ జోన్ లో
గడ్డివాములో నల్లత్రాచు హల్‌చల్.. భయంతో జనం పరుగులు
పెంపుడు కుక్కకు మత్తు మందు ఇచ్చి మరీ.. ఆలా.. ఎలా చేశారురా..
రూ.26 వేల జీతం.. రూ.70 వేల ఐఫోన్.. మండిపడుతున్న నెటిజన్లు
Samantha: నిశ్చితార్థం ఎప్పుడో చేసుకుంది! కాకపోతే హింట్ ఇచ్చినా ఎవరూ పట్టించుకోలే
